
అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరూ చూశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో భార్యని కోల్పోయిన వ్యక్తి, సామాన్య ప్రజలు, ప్రతిపక్షాలతో సహా అందరూ అల్లు అర్జున్‌కే సంఘీభావం తెలిపారు.
కనీవినీ ఎరుగని విదంగా యావత్ తెలుగు సినీ పరిశ్రమ కదిలి వచ్చి అల్లు అర్జున్‌కి సంఘీభావం తెలిపింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం అల్లు అర్జున్‌పై ఎందుకు ఇంత కక్ష కట్టింది? అసలు ఆయన అరెస్ట్ వెనుక అసలు ఉద్దేశ్యం లేదా అసలు కారణం ఏమిటి? అని అందరూ ప్రశ్నించారు.
అల్లు అర్జున్‌పై తమ ప్రభుత్వానికి ఎటువంటి కక్ష లేదని మంత్రి సీతక్క సర్ధిచెప్పుకున్నారు. చనిపోయిన మహిళ కుటుంబానికి న్యాయం చేయడానికే అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ వారి మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఎందుకంటే అవి నమ్మశక్యంగా లేవు కనుక.
అల్లు అర్జున్‌కి నాంపల్లి కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించగా, హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ నాలుగు వారాలు మద్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తీవ్ర విమర్శలు, వ్యతిరేకత ఎదురైనందున ఇక ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గుతుందని అందరూ భావించారు.
కానీ తాజా సమాచారం ప్రకారం, పోలీస్ శాఖ హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంటే అల్లు అర్జున్‌కి హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ రద్దు చేయమని కోరబోతోందన్న మాట! ఇదే నిజమైతే అల్లు అర్జున్‌ని మళ్ళీ అరెస్ట్ చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లే భావించవచ్చు.
కనుక అల్లు అర్జున్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈవిదంగా ఎందుకు వ్యవహరిస్తోంది? దాని పరమార్ధం ఏమిటనే ప్రశ్నలు మళ్ళీ వినిపిస్తాయి. ఒకవేళ మరోసారి అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తే బహుశః ఈసారి సినీ ప్రముఖులు అందరూ బహిరంగంగానే ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ విమర్శించక మానరు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…