ఎన్టీఆర్ ఫాన్స్ ని రెచ్చ కొడితేనేగా పని అయ్యేది మరి !

Jr NTRjanatha-Garageప్రస్తుత కాలంలో “సినిమాలను – రాజకీయాల”ను విడదీసి చూడలేని పరిస్థితి. అలాగని ప్రతి చిన్న అంశాన్ని ‘సినిమాలు – రాజకీయం’తో ముడిపెట్టి చూడడం కూడా సరైన విషయం కాదు. కానీ, చిన్న చిన్న అంశాలను కూడా భూతద్దంలో పెట్టి చూడడం టిడిపి వ్యతిరేక మీడియా వంతవుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాల రీత్యా జూనియర్ ఎన్టీఆర్ కు – పార్టీకి మధ్య దూరం పెరిగిందన్న విషయం బహిరంగమే. దీనికి మరింత ఊతమిచ్చే విధంగా తాజాగా ఒక మీడియా వర్గం సరికొత్త ప్రచారానికి తెరలేపింది.

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఎదగనివ్వకుండా ‘తెలుగు మీడియా’ పూనుకుందని, ఇటీవల విడుదలైన ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ విషయంలో ‘తెలుగు మీడియా’ అసలు ప్రాధాన్యత ఇవ్వలేదని ‘టిడిపి వ్యతిరేక మీడియా’ ప్రచారం చేస్తోంది. ఇదంతా కూడా ఏపీలో అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం ప్రభుత్వం ‘కుట్ర’గా అభివర్ణించడం అత్యంత శోచనీయమైన అంశం. చదవడానికి, వినడానికి ఎంతో సిల్లీగా ఉన్న ఈ అంశాన్ని ‘హైలైట్’ చేస్తూ కధనాలు రాయడం బహుశా ‘అలాంటి’ మీడియాలకే చెల్లుబాటు అవుతుందేమోనని అనిపించక మానదు.

ADVERTISEMENT

అయితే వాస్తవ పరిస్థితులను గమనిస్తే… ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ విడుదలైన మరుక్షణం సోషల్ మీడియా, వెబ్ మీడియాలు… ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్లు, కధనాలు హోరెత్తాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఇచ్చే సమయంలో తెలుగు మీడియా కూడా ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ పై ప్రత్యేకించి ప్రస్తావించింది. దాదాపుగా ప్రధాన ఛానల్స్ అన్ని ‘జనతా గ్యారేజ్’ లుక్స్ పై కధనాలు రాసాయి. ఇక, జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజున మహేష్ ‘బ్రహ్మోత్సవం’ విడుదల కావడంతో, సహజంగానే హాట్ హాట్ అంశం ‘బ్రహ్మోత్సవం’ రివ్యూలనే హైలైట్ గా వీక్షకులు చూస్తారు. జరిగింది కూడా అదే..!

ఇలా వాస్తవాన్ని పక్కనపెట్టి… దీని వెనుక రాజకీయ కోణం ఉందంటూ… చంద్రబాబు సర్కార్ పనికట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ సినిమాను వెనక్కి నెట్టాలని ఆరోపణలు చేయడమనేది కేవలం హాస్యాస్పదమైన విషయం. ఎప్పుడూ జగన్ ‘భజన’ తప్ప మరొక అంశానికి ప్రాధాన్యత ఇవ్వని సదరు మీడియా వర్గాలు, దీని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొట్టి, టిడిపిపై వ్యతిరేక భావన వచ్చేలా చేయాలనేది ప్రధాన ఉద్దేశం కావచ్చు. అయితే ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురిపించలేదని… నిరసనలు తెలియజేసే అభిమానులూ కూడా ఉన్నారా… ఒక్కసారి ఆలోచిస్తే… మరింత హాస్యాస్పదంగా ఉంటుందేమో..!

ఇంతకీ మరో అసలు విషయం ఏమిటంటే… ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్ లుక్ విడుదల సమయంలో సదరు మీడియా వర్గం చేసిందేమిటో కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందేమో..!

ADVERTISEMENT
Latest Stories