Telugu

రక్త సంబంధాలే రాజకీయ సంకేళ్లుగా మారుతున్నాయా.?

రాజకీయాలలో బంధాలకు, అనుబంధాలకు తావు ఉండదు అనేది అనేక ఘటనలతో నిత్యం నిరూపితం అవుతూనే ఉంటాయి. అయితే రక్త సంబంధీకులు రాజకీయాలలో ఉంటే వారు ఎప్పటికైనా ఏదొకరూపంలో ప్రత్యర్థులుగా మారాల్సిందేనా అంటే…అందుకు కొన్ని ఉదాహరణలుగా ….

కొణిదెల కుటుంబం విషయానికొస్తే వీరు వ్యక్తిగతంగా, సినీ పరిశ్రమ పరంగా అందరు ఒక్కటే తాటి మీదే ఉంటారు. అన్న మాటకు ఎదురు చెప్పని లక్షణుల మాదిరి తమ్ముళ్లు నాగబాబు, పవన్ చిరంజీవికి అంతటి గౌరవాన్ని ఇస్తారు. కానీ అటువంటి కుటుంబంలో కూడా అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ మధ్య రాజకీయ విభేదాలు ఏర్పడ్డాయి.

ADVERTISEMENT

చిరు ప్రజారాజ్యం తో ఇచ్చిన పొలిటికల్ ఎంట్రీ కి మద్దతు పలికిన పవన్ పీఆర్పీ ని కాంగ్రెస్ లో విలీనం చేయడాన్ని వ్యతిరేకించారు. అలాగే అన్న ఎంపీ గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా “కాంగ్రెస్ హటావ్ దేశ్ బచావ్” అనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనితో ఈ ఇద్దరి అన్నదమ్ముల రాజకీయ దారులు వెరవక తప్పలేదు, ఒకరికొకరు రాజకీయ ప్రత్యర్థులుగా ఎదురుపడక తప్పలేదు.

ఇక వైఎస్ కుటుంబం విషయానికొస్తే వైసీపీ పొలిటికల్ ఎంట్రీతో అన్న – చెలెళ్ళు జగన్, షర్మిల ఒక్కటై కాంగ్రెస్ కి వ్యతిరేకంగా గళం విప్పారు, టీడీపీ పై రాజకీయ యుద్దానికి సై అన్నారు. కట్ చేస్తే వైసీపీ ఓటమే షర్మిల రాజకీయ ఎజెండా గా మారింది, షర్మిల పతనమే జగన్ లక్ష్యమయ్యింది.
కల్వకుంట్ల కుటుంబ కథ కూడా ఇంచుమించు వైఎస్ కుటుంబ కథనే పోలిఉండడం ఇక్కడ కొసమెరుపు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యం అన్నట్టుగా ఉద్యమ బరిలోకి దిగిన కల్వకుంట కుటుంబం ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగిన పదేళ్ల తరువాత తండ్రి కేసీఆర్, తనయుడు కేటీఆర్ బిఆర్ఎస్ గా కుమార్తె కవిత తెలంగాణ రక్షణ సేన గా వేరుకుంపటి పెట్టుకున్నారు.

నాడు అందరు ఒక్కట్టై ప్రత్యర్థుల మీద కథం తొక్కితే ఇప్పుడు అన్న ను రాజకీయంగా పతనం చెయ్యడానికి చెల్లి, చెల్లి రాజకీయ భవిష్యత్ కి ఎండ్ కార్డు వెయ్యాలని అన్న, ఇద్దరికి నచ్చచెప్పలేక తండ్రి ఇలా నాటి రాజకీయ బంధాలే నేడు కేసీఆర్ కి రాజకీయ సంకేళ్లుగా మారాయి.

అలాగే ఎన్టీఆర్ కుటుంబంలో కూడా ఇటువంటి రాజకీయ విభేదాలు కనిపించాయి. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ స్థాపిస్తే కాంగ్రెస్ నేతలుగా కుమార్తె పురంధరీశ్వరి, ఆయన భర్త దగ్గుపాటి వెంకటేశ్వరావు చెలామణి అయ్యారు. కాంగ్రెస్ లో ఉంటూనే తండ్రి స్థాపించిన టీడీపీ రాజకీయ పతనాన్ని కోరుకున్నారు.

దీనితో సొంత ఒకేకుటుంబానికి చెందిన వారే రాజకీయ ప్రత్యర్థులుగా మారారు. అయితే వీరి మధ్య ఉన్న విభేదాలు కేవలం రాజకీయాలకు మత్రమే పరిమితం అవ్వడంతో రాజకీయ దారులు మాత్రమే వేరయ్యాయి.

ఇక కాపు నాయకుడిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితమైన ముద్రగడ కుటుంబంలో కూడా తండ్రి – కూతుర్ల మధ్య ఈ రాజకీయం చిచ్చు పెట్టింది. ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలవాల్సిన ఈ రక్త సంబంధాలు చివరికి కడసారి చూపుకు కూడా కరువయ్యే పరిస్థితిని తెస్తున్నాయి. అంటే రాజకీయాలలో రక్త సంబంధాల కంటే రాజకీయానికి విలువెక్కువా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

గులాబ్ జామ్‌లా స్థానిక ఎన్నికలు.. ఊరిస్తున్నాయి కానీ…

గులాబ్ జామ్ చూస్తే నోరూరుతుంది. కానీ నోట్లో వేసుకోవాలంటే షుగర్ పెరిగిపోతుందని భయం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా…

7 minutes ago

3L Houses and 3D Homes: CBN’s Big Housing Push

Chief Minister Chandrababu Naidu and Union Minister Shivraj Singh Chouhan launched construction works for 3…

54 minutes ago