
మేము అనుకున్నదేమిటి? జరుగుతున్నదేమిటి?ప్యాలస్‌లో ప్రెస్‌మీట్లు, పార్టీ సమావేశాలు పెట్టుకొని ‘ఆలో లక్ష్మణా….’ అని మేము ఏడుస్తుంటే, కడుపు మంటతో మేము రగిలిపోతుంటే… మీ ఇకఇకలు పకపకలు ఏమిటి?
మీరు పొత్తులు పెట్టుకోకూడదని మేము ఎంత చెప్పినా వినలేదు. సరే! కనీసం అధికారంలోకి వచ్చాకైనా కొట్టుకు చస్తారనుకుంటే ఏదో సొంత అన్నదమ్ములా ఈ ప్రేమలు, అభిమానాలు ఏమిటి?
ముగ్గురూ నిన్న బస్సు ఎక్కితే ఎక్కారు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు బస్సులో డబ్బులిచ్చి టికెట్లు తీసుకోవడం ఏమిటి?
తీసుకుంటే తీసుకున్నారు..ఒకరి టికెట్ మరొకరు కొనేందుకు ఆ పోటీలు ఏమిటి?మీ పద్ధతి మాకు బొత్తిగా నచ్చడం లేదబ్బాయిలు…. మీ ప్రేమలు, అభిమానాలు చూస్తే మా కడుపు రగిలిపోతోందిక్కడ… ఎన్ని ఇనో ప్యాకెట్లు వేసుకున్నా తగ్గడం లేదు… అసలు తగ్గనిస్తేనా? ఆయ్!
సరే మీరు ముగ్గురూ రాజకీయాలలో ఉన్నారు… పదవులలో ఉన్నారు… మాలాంటి వారికి ఈ కడుపు మంట ఇంకా పెంచాలనేని ఈవిదంగా కుట్ర చేస్తున్నారని మేము సర్ది చెప్పుకోగలం. కానీ ఆ భువనేశ్వరిగారికి, ఆ రష్యా అమ్మాయి అన్నాలిజినోవాకి ఏం సంబంధం? ఇద్దరూ తోటి కోడళ్ళా పక్కపక్కన కూర్చొని ఆ ముచ్చట్లు ఏమిటి?మా ఇంట్లో కూడా ఆడాళ్ళున్నారు. వాళ్ళెప్పుడైనా ఇలా ముచ్చట్లు చెప్పుకోలేదే?
అయినా ఆ రష్యా పిల్లకి మన రాజకీయాలు తెలియవు కనుక పోనీలే అనుకుంటాం. కానీ ‘అమ్మా భువనేశ్వరీ… మీకన్నీ తెలుసు కదా?కానీ మీరు కూడా మీ ఆయనలా నలుగురితో కలిసిపోయి ఎవరితో పడితే వారితో అలా మాట్లాడేస్తుంటే ఎలా?
ఇంకా నయం! మా అదృష్టం కొద్దీ మీ కోడలు పిల్ల రాలేదు. వస్తే ఆవిడ కూడా గలగలా మాట్లాడేస్తుంటారు. సొంత చెల్లి, తల్లినే మేము కోర్టుకు ఈడ్చి విమర్శిస్తుంటే మీరందరూ ఇలా ఒకరినొకరు అభిమానించేసుకోవడం ఏమైనా బాగుందా?
మేము ఎన్ని లెక్కలు వేసుకొని ఎదురుచూస్తున్నామో మీకేమైనా అర్ధం అవుతోందా అసలు? ముఖ్యమంత్రి కుర్చీ కోసం పవన్ కళ్యాణ్ మీతో గొడవపెట్టుకొని బయటకు వచ్చేస్తారనుకున్నాము.
కానీ అయన మీరే మరో పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటున్నారు. పైగా మీకు శిష్యరికం చేసి ఇంకా ఏదో నేర్చుకోవాలంటున్నారు. ఇలా అయితే ఎలా?
పోనీ ఆ పిల్లాడు నారా లోకేష్‌తో గొడవ పెట్టుకుని బయటకు వచ్చేస్తారనుకుంటే మీరేమో ‘తమ్ముడూ… తమ్ముడూ…’ అంటూ చీటికి మాటికి ఆ పిల్లాడిని కౌగలించేసుకుంటారు.
ఆ పిల్లాడు కూడా మీరేదో తోడబుట్టిన అన్నయ్య అన్నట్లు ‘అన్నయ్యా… అన్నయ్యా…’ అంటూ మీ వెనకాతలే తిరుగుతుంటాడు.
మా ఇంట్లో ఆడాళ్ళు, మగాళ్ళు ఎవరూ కూడా ఇంత ఇదిగా ప్రవర్తించరు. అవసరమైతే కోర్టు కీడ్చుకుంటాము తప్పనిసరైతే గుండెపోటులు తెప్పిస్తుంటాము అంతే!
కానీ మీ ముగ్గురబ్బాయిలకి… ఆ తోటి కోడళ్ళకి ఒకటి మాత్రం చెప్పక తప్పదు. మీరు ఇలా ప్రవర్తిస్తూ మమ్మల్ని ఎంత క్షోభ పెడుతున్నారో మీకు అర్ధం కావడం లేదు. ఈ మానసిక క్షోభని తట్టుకోలేక ప్యాలస్‌లో ప్రెస్‌మీట్లు, సమావేశాలు పెట్టుకొని మా గోడు అందరికీ మొర పెట్టుకుంటూనే ఉన్నాము కదా? అయినా మా బాధ అర్ధం చేసుకోకపోతే ఎలా?మాకెందుకీ శిక్ష?
ముఖ్యమంత్రి పదవి, అధికారం పోతే పోయే… కానీ ఇవన్నీ చూస్తుండటం మాకు చాలా నరకంగా ఉంది. మమ్మల్ని మా ప్యాలస్‌లో కూడా ప్రశాంతంగా బ్రతకనీయరా?ఆయ్!
Srikanth Odela’s The Paradise is carrying huge expectations. The Nani starrer is finally locked for…
Director Parasuram Petla is lining up a big-budget film with the producers of HanuMan. As…