
ఓ పక్క ఆపరేషన్ సింధూర్‌తో దేశం సరిహద్దు అవతల ఉన్న శత్రువులను భారత్ దళాలు మట్టుబెడుతుంటే, మరోపక్క తెలంగాణలో ములుగు జిల్లాలో కర్రెగుట్టల వద్ద మావోయిస్టులతో భద్రతా దళాలు మరో పోరాటం చేస్తున్నాయి.
వీటికి సమాంతరంగా దేశ వ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య యుద్ధాలు, ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. రాజకీయ పార్టీల మద్య జరుగుతున్న ఈ యుద్ధాలు కూడా దేశాభివృద్ధికి పెద్ద అవరోధంగా మారుతున్నాయి.
తెలంగాణలో అధికార కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మద్య జరుగుతున్న రాజకీయ యుద్ధాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం పొంచి ఉంది. తన ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేదని తెలిసిన బిఆర్ఎస్ పార్టీ నేతలు టిజిఎస్ ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టి తన ప్రభుత్వాన్ని అస్తిర పరచడానికి కుట్ర చేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వాలను కూల్చేసే రాజకీయాలు యుద్ధం వంటివే కదా?
ఇక ఏపీలో కూడా ఇంత కంటే నీచమైన యుద్ధాలే జరుగుతున్నాయి.
ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న భారత్‌కు చెందిన 5 యుద్ధ విమానాలు కూల్చేశామని పాకిస్థాన్ దుష్ప్రచారం చేస్తూ, భారత్ ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సరిగ్గా అదేవిదంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అమరావతి, పోలవరం అభివృద్ధి పనుల గురించి వైసీపీ కూడా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ దెబ్బ తీయాలని విశ్వప్రయత్నాలు చేస్తోంది.
సరిహద్దులో ఇరు దేశాల మద్య, అడవులలో మావోయిస్టులు-భద్రతా దళాలకు మద్య జరిగే యుద్ధాలకు, రెండు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధాలకు ఒకటే తేడా. అక్కడ సైనికులు, మావోయిస్టులు మరణిస్తుంటారు. రక్తం ఏరులై పారుతుంటుంది.
ఇక్కడ జరిగే రాజకీయ యుద్ధాలలో ఎవరు గెలిచినా, ఓడినా ప్రజలే దానికి మూల్యం చెల్లించాలి. అక్కడ కేసీఆర్ హయంలో అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు అప్పులు చేయగా, ఇక్కడ సంక్షేమ పధకాల పేరుతో జగన్ కూడా లక్షల కోట్లు అప్పులు చేశారు. వారు చేసిన అప్పులు, తప్పులకు వారు జవాబుదారీ కారు. సామాన్య ప్రజలే వాటికి మూల్యం చెల్లించక తప్పదు. కనుక తుపాకులతో జరిగే యుద్ధాలకు, అవి లేకుండా జరుగుతున్న ఈ రాజకీయ యుద్ధాలకు తేడా ఏముంది? రెంటి వలన నష్టం తప్పదు కదా?
Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…
GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…