
పూనమ్ కౌర్ నటిగా కంటే కూడా సంచలన సోషల్ మీడియా యూజర్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో చాల ఫేమస్ అయ్యారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పూనమ్ పేరు ఎపుడు ఒక సంచలమనే చెప్పాలి.
అయితే ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్ వ్యూ లో మరికొన్ని సంచలనాలను బయటకు తెచ్చారు. కడప నుంచి వచ్చిన కొందరు తమ రాజకీయ లబ్ది కోసం, తమ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక యాక్టర్ కి వ్యతిరేకంగా మాట్లాడాలని అని డిమాండ్ చేసారు.
అందుకు ప్రతిగా తనకు డబ్బులు, పదవులు కూడా ఆఫర్ చేసారని, ఒకవేళ తాము చెప్పినట్టుగా పూనమ్ చేయని పక్షాన ఆమె న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తామంటూ తనను బెదిరించినట్టు తన ఆవేదనను వినిపించిన పూనమ్ మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యారు.
అయితే పూనమ్ ఆరోపిస్తున్న ఆ కొందరు రాజకీయ నాయకులు, ఆ పార్టీ ఏది.? అసలు ఏ యాక్టర్ కి వ్యతిరేకంగా పూనమ్ మాట్లాడాలని సదరు నేతలు ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. కడప నుంచి వచ్చిన ఆ రాజకీయ నేతలు ఎవరు.? ఈ న్యూడ్ వీడియోల బెదిరింపుల వెనుకున్న ఆ బ్లూ బ్యాచ్ ఎవరు అనేది ఇక్కడ చర్చనీయాంశం.
గతంలో పూనమ్ ట్వీట్లు అన్ని కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఉండేవి. అయితే వ్యక్తిగతంగా పవన్ ను టార్గెట్ చేసేందుకు వైసీపీ ఈ అంశాన్ని ఎప్పుడు ఏదోవిధంగా లైవ్ లైట్ లో ఉంచేందుకు చూసేది.
అలాగే అప్పట్లో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పోసాని కృష్ణ మురళి ద్వారా పవన్ ను ఇరకాటంలో పెట్టేందుకు పూనమ్ కౌర్ కి పవన్ అన్యాయం చేసారంటూ వైసీపీ ప్రెస్ మీట్లు కూడా పెట్టించి జనసేన ఆగ్రహానికి కారణమయ్యింది. ఆ సమయంలో పోసాని సంయమనం కోల్పోయి చాల హద్దులు దాటేసారు.
ఆ పోసాని పెట్టిన ఒక్క ప్రెస్ మీట్ పుణ్యమాని తనకి తన స్నేహితుడికి జాగరగాల్సిన వివాహం ఆగిపోయిందని, దాని ఫలితంగా తన తల్లికి గుండె పోటు వచ్చిందని, ఈ రాజకీయ నాయకుల రాజకీయాలకు తానూ ఎంతో మానసిక క్షోభ అనుభవించాల్సి వచ్చిందని, వారి రాజకీయంలో ఎంతో విలువైన కాలం, జీవితం కోల్పోయంటూ తన ఆవేదనను, తన మానసిక భావోద్వేగాలను బయటపెట్టారు పూనమ్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…