పవన్ ప్రజాదరణ: తెలంగాణ లోను అదే లెక్క.!ఏపీ లోనూ అదే ఆందోళన.!

పవన్ రాజకీయ సభలకు వచ్చే ప్రజాదరణ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సభలకు కూడా రాదు అని చెప్పటం అతిశయోక్తి కానే కాదు.పార్టీ స్థాపించి దశబ్దం గడిచినా ఇంకా సంస్థాగతంగా బూతు స్థాయిలో పార్టీని, పార్టీ నాయకులను సిద్ధం చేయడంలో పవన్ చాల అల్సత్వాన్ని ప్రదర్శించారనేది కూడా అంతే వాస్తవం.

సినిమా రంగంలో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్ కెరియర్ ఒక్క పరాజయంతో పుష్కరకాలం పాటు హిట్ అనే పదాన్ని మర్చిపోవలసి వచ్చింది.అయినా కూడా పవన్ తన వ్యక్తిత్వంతో తన వ్యక్తిగత ఇమేజ్ ను జయాపజయాలతో సంబంధం లేకుండా పెంచుకుంటూ పోయారు. అలాగే రాజకీయాలలో కూడా పార్టీ పెట్టి పోటీ చేసిన రెండు స్థానాలలో అపజయాన్ని మూటకట్టుకున్నా కూడా ప్రజాదరణలో ఎక్కడాతగ్గేదెలా అన్నట్టు దూసుకుపోతున్నారు.

ADVERTISEMENT

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా తమ జేబులో డబ్బులతో, సొంత ఖర్చులతో ప్రజలు రాజకీయ సభలకు హాజరయ్యేది ఒక్క పవన్ కళ్యాణ్ సభలకే అనేది కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది జనసేన పార్టీకి. మిగతా రాజకీయ పార్టీలకు తమ పార్టీ తరుపున ఏర్పాటు చేసిన సభలకు స్వచ్ఛందంగా వచ్చే వారెంతమందో, జన సమీకరణ చేసేది ఎంతమందినో అనే లెక్క ఒకటి ఉంటుంది.

ప్రతి సభకు ఆ లెక్కను పరిగణలోకి తీసుకుని పార్టీ గ్రాఫ్ పెరిగిందా? తగ్గిందా?అనేది అంచనా వేయగలరు.కానీ జనసేన పార్టీకి అలా అంచాలను వేయడానికి తద్వారా చేపట్టాల్సిన చర్యలను ఆలోచించడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రజాదరణ చూస్తే లక్షల్లో ఉంటుంది. ఓట్లు చూస్తే వేలల్లో కొన్ని ప్రాంతాలలో అయితే వందల్లో ఉన్నాయి. అసలు లోపం ఎక్కడ జరుగుతుంది.పరిష్కారం ఎక్కడా నుంచి మొదలుపెట్టాలి?

దానికి తీసుకోవాల్సిన చర్యలేంటి అనేదాని మీద దృష్టి పెట్టాల్సిన పార్టీ పెద్దలు మాత్రం పవన్ సభలకు హాజరయ్యే ప్రజాసంఖ్య మాయలో పడిపోతున్నారే తప్ప వాస్తవపరిస్థితులను అంచనా వేయడంలో విఫలమవుతున్నారు.తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో జనసేన ప్రభావం మెరుగైన స్థానంలోనే ఉందని చెప్పాలి.ఆంధ్రాలో ఏర్పాటు చేసిన రాజకీయ వేదికలకు ఎంత సంఖ్యలో అయితే ప్రజాదరణ దక్కుతుందో అంతే స్థాయిలో నేడు తెలంగాణ కొత్తగూడెం సభకు కూడా ప్రజాదరణ దక్కడంతో సభకు వచ్చిన వారు పవన్ ను చూడడానికి వచ్చారా లేక జనసేన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారా అనే సందేహం ఇటు ఏపీ జనసైనికుల మదిలో మొదలయ్యింది.

అసలు ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో జనసేన పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై తన పోరాటం మొదలు పెట్టనేలేదు, కనీసం రెండంకెల స్థానంలో కూడా పార్టీ నాయకులను ఎన్నికల బరిలో నిలబెట్టను లేదు.అయినా కూడా పవన్ సభలకు ఇంత ప్రజాదరణ రావడం నిజమైన జనసేన అభిమానులలో కలవరం పుట్టిస్తుంది. ఏపీలో జనసేన నిర్వహిస్తున్న సభలకు భారీ సంఖ్యలో ప్రజలు అందులోనూ ముఖ్యంగా యువత పాల్గొంటారు.

అయితే వీరంతా పవన్ రాజకీయ ప్రసంగాలకు చైతన్యమయ్యి జనసేన పార్టీకి అండగా నిలబడతారని ఆశించిన పవన్ అభిమానులకు ఇప్పుడు అసలు తెలంగాణలో రాజకీయ ఉనికే లేని జనసేనకు కూడా ఇదే స్థాయిలో ప్రజలు హాజరవ్వడంతో ఇదంతా పవన్ సినీ క్రేజా? లేక నిజంగా జనసేనకు పెరిగిన రాజకీయ బలమా? అనే అనుమానంలో మునిగి తేలుతున్నారు.

పవన్ అభిమానులు కూడా పవన్ కు ఉన్న ప్లస్ పాయింట్స్ మాత్రమే గుర్తిస్తాం ఆయన పై చేసే విశ్లేషనాత్మ విమర్శలను, సూచనలను సైతం ఒప్పుకోము అంటూ ముందుకెళ్తే రాజకీయాలలో ఎప్పటికి ఏదోక పార్టీ వెనుకే నిలబడి తమ బలాన్ని పక్క పార్టీల ఎదుగుదలకే ఖర్చు చేయాల్సి వస్తుంది అనేది ఇప్పటికైనా పవన్ తో పాటు ఆయన అభిమానులు కూడా గుర్తించాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

14 ODIs Before IPL 2027: Ro-Ko’s Last Presence?

India will play 14 ODIs before IPL 2027 as the team prepares for the 2027…

10 minutes ago

Retro Fever Takes Over Tollywood

The 80s seem to be back in Tollywood. A trend that started on social media…

41 minutes ago