Telugu

జైలుకు వెళ్తే తప్పు చేసినట్టేగా..! ఒప్పుకోండి మరి.!

ఒకప్పుడు సినీ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి నటనతో తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్న పోసాని కృష్ణ మురళి రాజకీయాలలోకి వచ్చి చేస్తున్నదిగజారుడు విమర్శలతో కొన్ని వర్గాల ప్రజలకు విలన్ గా మిగిలిపోయారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ రాజకీయ పార్టీ కైనా మద్దతు తెలపొచ్చు ఏ రాజకీయ నాయకుడికైనా అభిమానిగా మారొచ్చు తప్పులేదు. అంత వరకు అందరికి ఆమోదయోగ్యమే.

రాజకీయాలలో ప్రత్యర్థులను విమర్శించడం ఎక్కడైనా సహజమే. కానీ మెంటల్ కృష్ణ గా ఫేమస్ అయిన పోసాని ప్రభుత్వం పై నిరసన తెలిపితే రాష్ట్ర ప్రజలను సైతం వదలరు అని కొన్ని సందర్భాలలో రుజువు చేశారు. రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల భార్యలు పట్టు చీరలు కట్టుకున్నారని., నగలు వేసుకున్నారంటూ ఆడవారి పై పడి ఏడ్చే నేతలను ప్రోత్సహిస్తున్న జగన్ ఉత్తముడేనా? ఒప్పుకోండి మరి!

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ తల్లిని, భార్యను,చివరికి పిల్లలను సైతం వదిలిపెట్టకుండా సమాజం సిగ్గుపడే విధంగా చేసిన విమర్శలతోనే పోసాని తన స్థాయిని పాతాళానికి దిగజార్చుకున్నాడు. రాజకీయాలలో విపక్ష నేతలను విమర్శించడం తప్పుకాదు దానికి ఇక లిమిట్ ఉంటుందని ఈ వైసీపీ పైడ్ బ్యాచ్ కు బహుశా తెలియదేమో. చంద్రబాబు అంటే చాలు వెనక ముందు లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడే ఈ ప్రబుద్దుడు బాబు అరెస్ట్ పై చేసిన వెటకారాలతో ప్రజలకు ఒక కంక్లూజన్ ఇచ్చేసారు.

అవినీతి చేస్తే జైల్లో పెడతారు కదా? జైల్లో ఉన్న మీరు ఉత్తములు కారు కదా? అంటూ బాబు ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తిరిగి జగన్ దగ్గరకు వచ్చి ఆగాయి. అంటే జగన్ అవినీతి చేసినట్లేగా? అందుకే కటకటాల వెనక్కి వెళ్లారన్న మాట! అంటే వైసీపీ అధినేతే బెయిలు మీద రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడని., జగన్ ఒక అవినీతి పరుడని పోసాని ఒప్పుకున్నట్టేగా!

మరి జైలుకు వెళ్లి బెయిలు మీద తిరిగే వారు ఉత్తములు ఎలా అవుతారో? ఆయనే సెలవివ్వాలి. వైసీపీ నేతల పై అవినీతి కేసులు లేవా? చివరికి హత్య కేసులలో నిందితులుగా జైలుకు – బెయిలుకు మధ్య ఉగిసలాడుతూ ఉన్న నేతలు లేరా? అయితే జగన్ ఉత్తముడు కాదు అవినీతి పరుడు అని ఒప్పుకోండి మరి. నరం లేని నాలుక మీకే కాదు అందరికి ఉంటుందనే నిజాన్ని పోసాని ఎప్పటికి గ్రహిస్తారో!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ సీనియర్లకు హ్యాండ్ ఇచ్చి చంద్రబాబుని వేలెత్తి చూపడమా?

స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…

8 minutes ago

No Stress For Hero, But Full High For Fans!

Making a commercial action film with a 75-year-old superstar is not an easy task. However,…

9 minutes ago