
అధికారం ఉన్నంత కాలం ఎగిరెగిరి పడడం, అధికారం చేజారగానే పార్టీకి, పార్టీ అధినేతకు దూరంగా పారిపోవడం చేస్తుంటారు రాజకీయ నాయకులు. అయితే రాజకీయాలకు మాకు సంబంధం లేదు కానీ, మా వాడు పదవిలో ఉన్నాడు కాబట్టి నా నోటికి వచ్చిందల్లా వాగుతాను…నా చేతికి తట్టిందల్లా రాస్తాను అంటూ కొందమంది మెంటల్ మేధావులు గత ఐదేళ్లుగా ఏపీ రాజకీయాలలో చాల చురుకుగా పాల్గొన్నారు.
అందులో ప్రథమంగా చెప్పుకోవాల్సింది రాంగోపాల్ వర్మ. ఒక పెగ్గేస్తే కానీ నాకు తెల్లారదు…బూతు సినిమాలు చూస్తే కానీ నాకు పొద్దుపోదు అంటూ గర్వంగా చెప్పుకునే ఆర్జీవీ వైసీపీ ప్రభుత్వానికి, జగన్ కు వీరాభిమాని. ఆయన కోసం వైసీపీ ప్రత్యర్థి వర్గానికి వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా సినిమాలు కూడా తీసి తన స్థాయిని మరోమెట్టు దిగజార్చుకున్నారు.
‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ అంటూ టీడీపీ మీద ‘వ్యూహాలు’ రచించి కూటమి పార్టీ ఓడిపోయి తీరుతుంది అంటూ ‘రెండు శపధాలు’ కూడా చేసారు ఆర్జీవీ. తీరా ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ‘మీకు మీరే మాకు మేమే’ అంటూ వైసీపీ కి హ్యాండ్ ఇచ్చి సోషల్ మీడియా నుండి ‘అదృశ్యమ’య్యారు రామ్ గోపాల్ వర్మ.
నేను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అంటూనే పవన్ మీద మెగా కుటుంబం మీద ఎప్పుడు విషం కక్కుతూనే ఉండే వారు. పవన్ అభిమానులే తన టార్గెట్ గా పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చెయ్యడం వారిని రెచ్చకొడుతూ వారి భావోద్వేగాలతో పైశాచిక ఆనందం పొందడం గత పదేళ్లుగా ఆర్జీవికి అలవాటుగా మారిపోయింది.
అలాగే లోకేష్, బాబు ల మీద కూడా తనకున్న పైత్యాన్నంతా రంగరించి సినిమాలు తీసి, , సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టి అటు టీడీపీ క్యాడర్ను కూడా మానసికంగా బలహీన పరిచారు ఆర్జీవీ. అయితే ఎవరి అండ చూసుకుని ఇన్నాళ్లుగా పవన్ అభిమానులను, టీడీపీ కార్యకర్తలను రెచ్చకొట్టారో ఇప్పుడు ఆర్జీవీ కి ఆ అండ దూరమయ్యింది. దీనితో రాజకీయాలకు నాకు సంబంధం లేదు అంటు సోషల్ మీడియా నుండి పరారయ్యారు ఆర్జీవీ.
ఇక వైసీపీ కి మద్దతుగా పోసాని కృష్ణ మురళీ చేసిన లీలలు ఇన్ని అన్ని కావు. నేను ఏ రాజకీయ పార్టీలోనూ సభ్యుడిని కాదు అంటూనే వైసీపీ కండువా వేసుకుని చిన్న..పెద్ద, ఉచ్ఛం ..నీచం, వావి..వరుస లేకుండా ఒక పిచ్చివాడికన్నా హీనంగా దిగజారి ప్రవర్తించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టిన చిరంజీవిని మొదలుకుని, పవన్, బాబు, లోకేష్ ఇలా వరుస పెట్టి ప్రతి ఒక్కరిని జగన్ మెప్పుకోసం కించపరుస్తూనే వచ్చారు.
అసలు రాజకీయాలతో సంబంధం లేని సామాన్య ప్రజలను కూడా వదల్లేదు ఈ మెంటల్ కృష్ణ. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబంలోని మహిళలను, వారి వస్త్రధారణను కూడా అవమానించారు పోసాని. కేవలం జగన్ మీద ఉన్న పిచ్చి ప్రేమతోనో లేక జగన్ ఇచ్చే నోట్లకట్టల మీద వ్యామోహంతోనో పోసాని గత ఐదేళ్లుగా రోడ్ల మీద తిరిగే పిచ్చికుక్క మాదిరి మీడియాలో పిచ్చి వేషాలు వేశారు.
ఒక్క ఓటమి ఇంత విధ్వంసాన్ని నిశబ్దంగా ముగించేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్జీవీ పైత్యానికి ముగింపు దొరికింది. మీడియాలో పోసాని పైశాచికత్వానికి శుభం కార్డు పడింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం నోటికి మాత్రం పనిచెప్పిన ఈ వైసీపీ మద్దతుదారులు ఇప్పుడు నవరంధ్రాలు మూసుకుని కూర్చున్నారు. వైసీపీ ఓటమి ఇటువంటి వారందరిని జగన్ నుంచి దూరంగా పారిపోయేలా చేసింది.
కాకపోతే కూటమి ప్రభుత్వం ఇటువంటి వైసీపీ ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోకపోతే ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరికొన్ని విష ప్రాణులు రాజకీయాలను భ్రష్టు పట్టించే అవకాశం లేకపోలేదు. రాజకీయ విలువలు దిగజారుస్తూ, విశ్వసనీయత అనే పదానికి అర్ధం మార్చేస్తూ జగన్ చేస్తున్న రాజకీయం సమాజానికి అత్యంత ప్రమాదకరం. దీనిని కూకటి వేళ్ళతో పెకలించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉంటుంది.
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…