ఓం రౌత్ ప్రపంచవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న హీరో ప్రభాస్ తో ‘ ఆదిపురుష్’ సినిమా తీస్తున్నాడు. సరికొత్త టెక్నాలజీ ని ఉపయోగించి తీస్తున్నాం అని చెప్పి ఫాన్స్ లో క్రేజ్ ని పెంచారు. ప్రభాస్ కూడా ఈ సినిమా చెయ్యడానికి చాలా ఉత్సాహ పడ్డారు. ఈరోజు అయోధ్యలో రిలీజ్ చేసిన ఆది పుసురేష్ సినిమా టీజర్ చూసిన ఫాన్స్ కి నోట మాట రాలేదు.ఇక సాధారణ ప్రేక్షకులకైతే టి.వి. సీరియల్ చూస్తున్న అనుభవం కలిగిందని చెప్తున్నారు.
ట్రైలర్ లోని తొలి షాట్ లోనే మనకి తెలిసిపోతుంది ప్రభాస్ లుక్స్ పరంగా చాలా వయసైనట్లు కనిపించాడు. ప్రభాస్ తలని ఒక ౩డి బాడీ కి అతికించినట్లు. ఇక ప్రభాస్ కాస్ట్యూమ్ చూస్తే అచ్చం బాహుబలి కాస్ట్యూమ్ లాగే ఉంటుంది. రావణుడు సైఫ్ అలీ ఖాన్ పది తలల షాట్ చూస్తే, గ్రాఫిక్స్ చేస్తున్న వాళ్ళు చాలా సిల్లీ గా చేసారు అనిపిస్తుంది. రావణుడి మధ్య లో ఉన్న తల మాత్రమే సీతని చూస్తుంటది. మిగిలిన తలలన్నీ ఏటో చూస్తూ ఉంటాయి.
ఇక లక్ష్మణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం, లంక కోట ఇవన్నీ అచ్చం దూరదర్శన్ లో వచ్చే శక్తిమాన్ సీరియల్ లో గ్రాఫిక్స్ లా ఉంటాయి. రావణుడు ఎగిరే పక్షిని చూస్తే అసలు సహజత్వం ఎక్కడ అని దర్శకుడిని అడగాలనిపిస్తుంది. హీరోయిన్ కృతి సనన్ ఒక్క షాట్లోనే కనిపించింది. ఆమె అందంగా ఉంది.
ఇక ఈ గ్రాఫిక్స్ చేసిన వాళ్ళు డిస్నీ జంగల్ బుక్ ని కూడా వదల్లేదు. ఈ టీజర్ లోని వానర కోట అచ్చం ఆ సినిమాలోని పెద్ద కోతి కోట ని పోలి ఉంటుంది. ఇక ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ అయితే చెవికి సరిగ్గా వినపడవు. ఈ సినిమా కనుక విడుదలైతే బాలీవుడ్లో ప్రభాస్ కున్న పేరంతా పోవడం ఖాయం. తెలుగు ప్రేక్షకులకు బాహుబలి లాంటి విజువల్ వండర్ ఇచ్చిన ప్రభాస్ నుండి ఇలాంటి ౩డి బొమ్మల సినిమా వస్తుందని ఎవరూ ఊహించరు. తానాజీ సినిమాలో ఎం చూసి ప్రభాస్ ఓం రౌత్ కి ఛాన్స్ ఇచ్చాడో తెలియటం లేదు. ఈ టీజర్ చూసిన ప్రభాస్ అభిమానుల్లో భయం మొదలైంది. రామ రామా ఇలాంటి సినిమా ప్రభాస్ నుండి ఎవరు ఊహించరమ్మ! ఈ సినిమా కథ సీతను లంకకు తీసుకెళ్లడం దగ్గరనుండి మొదలై , రావణ వధతో ముగుస్తుందని వినికిడి.



