బాలయ్య ప్రభాస్ ల దెబ్బకు స్ట్రీమింగ్ క్రాష్

Prabhas Balakrishna unstoppable episode Aha streaming crashఓటిటిలో వచ్చే ఒక సెలబ్రిటీ టాక్ షో కోసం ఏకంగా వెబ్ సర్వరే హ్యాంగ్ అవ్వడం ఇదే మొదటిసారి. బాలకృష్ణ ప్రభాస్ ల తొలి కలయిక ఆన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 కోట్లాది ఫ్యాన్స్ కు ఇంకా స్ట్రీమింగ్ మొదలుకాకుండానే క్రాష్ అయిపోయింది. సాధారణంగా విపరీతమైన లోడ్ పడితే తప్ప ఇలా జరగదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఎపిసోడ్ కావడంతో చెప్పిన టైం 9 గంటలకు ఒక్కసారిగా అందరూ యాప్ లోకి ఎంటరయ్యారు. ఇంత రెస్పాన్స్ గతంలో ఎప్పుడూ చూడని ఆహా దెబ్బకు డౌన్ అయ్యింది.

సోషల్ మీడియాలో సాయంత్రం నుంచే దీని మీద కౌంట్ డౌన్ మొదలయ్యింది. కొందరు ఏకంగా థియేటర్లో స్క్రీన్ చేసి ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళమని అన్న వాళ్ళు లేకపోలేదు. ప్రభాస్ ప్రోమోలు విపరీతమైన ఆసక్తి రేపడం, అందులోనూ బాలయ్య ఎనర్జీ ఎవరూ ఇప్పటిదాకా అడిగే సాహసం చేయని ప్రశ్నలు టచ్ చేయడం సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎగ్జ్ జైట్ మెంట్ కు కారణమయ్యింది. అలెర్ట్ అయిన ఆహా వెంటనే రంగంలోకి దిగింది కాబట్టి ఏ క్షణంలో అయినా పరిస్థితి మాములుగా మారి అందరూ చూసేయొచ్చు.

ADVERTISEMENT

ఇక్కడే కాదు యుఎస్ తదితర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని నెటిజెన్ల నుంచి వస్తున్న రిపోర్ట్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులకు లేదా స్టార్ హీరో నటించిన వరల్డ్ ప్రీమియర్ కు తప్ప ఇలా జరగడం అరుదు. అందులోనూ ఇప్పుడిప్పుడే సర్వర్ కెపాసిటీ మీద దృష్టి పెట్టి 4కెకు అప్ గ్రేడ్ అయిన ఆహాకు ఇలాంటి ఇబ్బందులు మున్ముందు సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. దీనికే ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ముందస్తు ప్రిపరేషన్ చాలా అవసరం అయ్యేలా ఉంది. కేవలం షూటింగ్ కే మీడియాలో ఓ రేంజ్ రచ్చ జరిగింది.

ADVERTISEMENT
Latest Stories