యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహూ నెగటివ్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చాయి. అయితే భారీ బడ్జెట్ వల్ల సినిమా హిందీలో మాత్రమే హిట్ అయ్యింది. బాలీవుడ్ మార్కెట్ కోసం సాహూని మొత్తంగా బాలీవుడ్ యాక్టర్స్ తో నింపేశారు. అయితే ఇది తెలుగులో బ్యాక్ ఫైర్ అయ్యింది. దీనితో ఈ తప్పు తన తరువాతి సినిమా జాన్ లో జరగకుండా చూసుకునేందుకు నిర్ణయించుకుంటున్నాడు ప్రభాస్.
తెలుగు వెర్షన్, హిందీ వెర్షన్ వేరుగా షూట్ చెయ్యబోతున్నారు. తెలుగు వెర్షన్ లో విలన్ గా జగపతి బాబుని సంప్రదించారట. ఇప్పటికే సినిమా కొంత షూటింగ్ జరిగింది. వచ్చే నెలలోనే షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా కొంత టైం తీసుకుని అంతా సరిచూసుకోవాలి టీం కొంత డిలే చేసినట్టు సమాచారం.
1960 కాలం నాటి కథతో సినిమా తెరకెక్కుతోంది. అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా కోసం పాతిక వరకూ సెట్స్ హైదరాబాద్ లో నిర్మిస్తున్నారట. ఈ సెట్లు అప్పటి యూరోప్ నగరాలను పోలి ఉంటాయట. సాహూ సినిమా లాగానే జాన్ కూడా రెండో సినిమా డైరెక్టర్ దర్శకత్వం వహించడం గమనార్హం.
జిల్ అనే ఫెయిల్యూర్ సినిమా తీసిన రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం హాలిడే కోసం పారిస్ వెళ్ళాడు. సాహూలో ప్రభాస్ హెయిర్ స్టయిల్ గురించి, బరువు గురించి కొంత నెగటివ్ టాక్ వచ్చింది. దీనితో ఆయన బరువు తగ్గి, హెయిర్ స్టయిల్ కూడా మారచాలని ప్రభాస్ అనుకుంటున్నాడట.





