కల్కితో కర్ణుడు.. ఫౌజీతో చంద్రబోస్

Prabhas Fauzi Poster

ప్రభాస్ సినిమాలు ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఇన్ఫోటైన్మెంట్ కూడా పుష్కలంగా ఇస్తున్నాయి. అందుకు తాజా ఉదాహరణ ఫౌజీ ఇండిపెండెన్స్ డే స్పెషల్ పోస్టర్. గాంధీతో విబేధించి గన్ను పట్టి రక్తపాతంవైపుకు దూసుకుపోతున్న ఫౌజీగా ప్రభాస్ ముఖం కనిపించని పోస్టర్ మంచి ఆసక్తిని క్రియేట్ చేసింది.

అయితే.. గాంధీ వర్సెస్ సుభాష్ చంద్రబోస్ అనేది ఒక హిస్టారికల్ టాపిక్. గాంధీ సపోర్ట్ చేయక బోస్ ఒంటరివాడయ్యాడు అనే అభిప్రాయాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉంటాయి. గాంధీ వల్ల కాదు బోస్ వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని బలంగా నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు.

ADVERTISEMENT

అందువల్ల సినిమా రిలీజ్ అయ్యాక గాంధేయవాదులు వర్సెస్ బోస్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో కొట్టుకునే అవకాశం లేకపోలేదు. మరి సినిమాలో ఆ అంశాన్ని హను రాఘవపూడి ఎలా డీల్ చేసాడు అనేది తెలియదు కానీ.. అదొక డిస్కషన్ టాపిక్ అవ్వడం మాత్రం ఖాయం.

గతంలో కల్కి సినిమా విషయంలోనూ కర్ణుడు గొప్పా? అర్జునుడు గొప్పా? అనే టాపిక్ తో పురాణాల రిఫరెన్సులతో కొట్టుకుసచ్చారు ఫ్యాన్స్. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుందనుకోండి. ఇప్పుడు హిస్టారికల్ ఫ్యాక్ట్స్ తో ఫ్యాన్స్ ఎలా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తారు అనేది చూడాలి.

ఇలా ప్రభాస్ ప్రతి సినిమాకి డిస్కషన్ పాయింట్స్ దొరుకుతుండడం, ఆ డిస్కషన్స్ ద్వారా ఫ్యాన్స్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ ని ఎడ్యుకేట్ చేస్తుండడం అనేది మాత్రం ఒకరకంగా మంచిదే అని చెప్పొచ్చు. ఇకనుండి ప్రభాస్ సినిమా వస్తుందంటే.. అందులో ఎలాంటి డిస్కషన్ పాయింట్ ఉండబోతోంది అనేది ఆసక్తికరంగా మారుతుంది.

ADVERTISEMENT
Latest Stories