Telugu

“ఆర్ఆర్ఆర్”లో ప్రభాస్ రోల్?

దర్శకదిగ్గజం రాజమౌళి – రెబల్ స్టార్ ప్రభాస్ ల నడుమ ఎలాంటి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘బాహుబలి’ రెండు పార్టులతో ప్రభాస్ ను ఎక్కడో శిఖరాన నిలబెట్టిన రాజమౌళి, ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో “ఆర్ఆర్ఆర్” ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన వైనం తెలిసిందే.

ఈ సినిమా 25వ తేదీన విడుదల కానుండగా, మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న “రాధే శ్యామ్” కోసం ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాలుపంచుకున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా ప్రభాస్ ను అనేక ప్రశ్నలు అడగగా, దానికి ప్రతిగా ప్రభాస్ కూడా ఓ ఆసక్తికరమైన ప్రశ్నను జక్కన్నకు సంధించారు.

ADVERTISEMENT

ఎన్టీఆర్ – చరణ్ లతో తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్”లో తనకు కూడా ఓ రోల్ ఇవ్వాలనిపించలేదా? వారిద్దరితో పాటు నేను కూడా సిల్వర్ స్క్రీన్ పైన కనిపిస్తే బాగుండేది కదా, మీరు తలచుకుంటే తనకు ఓ పాత్రను సృష్టించడం పెద్ద విషయం కాదేమో… అంటూ డార్లింగ్ అడిగేయగా, దానికి జక్కన్న కూడా అంతే తెలివిగా సమాధానం చెప్పారు.

బాబు నువ్వు ఓ పెద్ద షిప్ లాంటివాడివి. నేను అడిగితే నువ్వు కాదనవన్న నమ్మకం నాకూ ఉంది. ఆ షిప్ లాంటి రోల్ ఉంటే నిన్ను రిక్వెస్ట్ చేసైనా చేయించుకునేవాడిని, కానీ బలవంతంగా ఆ షిప్ ను తీసుకువచ్చి ఓ సన్నివేశంలో ఇరికించలేను అంటూ నవ్వేసారు. సమయస్ఫూర్తిగా సమాధానాలు అందించడంలో ఎంతైనా జక్కన్న దిట్ట కదా అని మరోసారి నిరూపించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jasprit Bumrah to Play Only Tests? Ravi Shastri Reveals

Former India head coach Ravi Shastri has advised Jasprit Bumrah against playing all three formats…

16 minutes ago

నాటి కుప్పం తాలూకా ఫలితమే నేడు పుంగనూరు.?

ఏపీలో టీడీపీ vs వైసీపీ పార్టీల మధ్య స్థానిక పోరు వార్ వన్ సైడ్ అన్నట్టుగా మారుతుంది. నాటి వైసీపీ…

30 minutes ago