
ఈ ఏడాది జూన్ లో థియేటర్ల లోకి వచ్చి, రెబెల్ స్టార్ ప్రభాస్ చేసిన రచ్చ, ఇప్పట్లో రెబెల్ అభిమానులు గాని, ఇండస్ట్రీ వర్గాలు గాని మర్చిపోవు. ఆ స్థాయి కలెక్షన్లను సొంతం చేసుకున్నాడు డార్లింగ్ ప్రభాస్.
నాగ్ అశ్విన్ వంటి యువ దర్శకుడితో వచ్చి ఏకంగా 1000 కోట్లు కొల్లగొట్టేసాడు. ఇంకా ఆ ట్రాన్స్ నుండి బయటకు రాలేదు ప్రభాస్ అభిమానులు.అయితే తన తరువాత సినిమాల లైన్-అప్ తో బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర ప్రకటిస్తున్నాడా అన్నట్లుగా పాన్-ఇండియా లోనే క్రేజీయెస్ట్ లైన్-అప్ తో ఉన్నారు డార్లింగ్.
మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపూడి ఫౌజీ, సందీప్ స్పిరిట్, ప్రశాంత్ నీల్ సలార్-2 , నాగ అశ్విన్ కల్కి-2 వంటి భారీ, క్రెజి ప్రాజెక్ట్స్ ఇప్పటికే లైన్ లో ఉండగా, తాజాగా ప్రభాస్-ప్రశాంత్ వర్మ, ప్రభాస్-లోకేష్ కనగరాజ్ ల కాంబోలలో చిత్రాలు ఖరారయినట్లు సోషల్ మీడియా లో పుకార్లు జోరుగా ఊపందుకున్నాయి.
అయితే వీటి మీద అధికారిక ప్రకటన లేని చేత, ఫేక్ న్యూస్ అనుకున్న అభిమానులకు ఇటీవలే ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ “హోంబాలె” (కె.జీ.ఎఫ్,సలార్ ను రూపొందించారు) విడుదల చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియా నే ఊపేస్తోంది. ప్రభాస్ తో వరుసగా 3 సినిమాలు అంటూ 2025 , 26 ,27 మూడేళ్లలో మూడు సినిమాలు విడుదల చేస్తున్నట్లు అధికారిక పోస్టర్ విడుదల చేశారు.
దానికి తోడు, గత కొద్ది నెలలుగా తార స్థాయి లో వినబడుతున్న వార్త: సందీప్ వంగా మూవీ ‘స్పిరిట్’ లో కొరియన్ సూపర్ స్టార్ ‘డోన్ లీ’ ప్రభాస్ కు విలన్ రోల్ లో నటించబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే,దీని పై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ నిన్న అభిమానుల సందేహాలన్నీ చెల్లాచెదురు చేస్తూ ఆయనే ఒక పని చేసారు.
స్వయంగా ‘డోన్ లీ’ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ‘సలార్-2 ‘ అంటూ ఒక ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను స్టోరీ లో టాగ్ చేశారు. ఇక దీనితో రెబెల్ ఫాన్స్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ పై తండోపతండాలుగా పడ్డారు. ఇప్పటిదాకా రెబెల్ ఫాన్స్ వల్ల ‘బుక్ మై షో’ క్రాష్ అవ్వడం చూసారు, ‘లైవ్ స్ట్రీమ్’ స్టక్ అవ్వటం చూసారు,’యూట్యూబ్ వీడియో’ స్టక్ అవటం చూసారు, కానీ మొదటిసారిగా వీరి వల్ల ఒక ఇంస్టాగ్రామ్ స్టోరీ స్టక్ అవ్వటం జరిగింది.
అభిమానులు లక్షల్లో ఆ స్టోరీ ని చూసినందుకు గాను, కొద్ది నిమిషాల పాటు ఆ స్టోరీ స్టక్ అయ్యింది .ఇక, ‘రెబెలోడి రచ్చ ఇప్పట్లో ఆగదు’ అని, ‘వరద వాడ్ని ఆపు’ అంటూ డైలాగ్ లతో రాజు గారి అభిమానులు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పండగ చేసుకుంటున్నారు. ఈ సంబరాలకు డార్లింగ్ అభిమానులే ‘వాడాగడు వరద’ అంటూ బదులిచ్చి రెచ్చిపోతున్నారు. చూడాలి మరి, ప్రభాస్ బాక్స్ ఆఫీస్ రేంజ్ ఇంకెంత పెరుగుతుందని..!
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…
After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…