
అదే సీరియల్ లో నాకు మదర్ రోల్ చేస్తోన్న శ్రీ విద్య గారు ఆ సమయంలో నా ఎదురుగానే వున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి కాల్ వచ్చిందని విషయం చెప్పగా… “ఇదిగో చూడు ఒకటి నువ్వు కేరక్టర్ ఆర్టిస్ట్ గా వుండాలనుకో… లేదంటే హీరోయిన్ ను కావాలనుకో. కేరక్టర్ ఆర్టిస్ట్ ను అనుకుంటే అమ్మ… అక్క… వదిన… ఎవరైతే ఏంటి? లేదంటే హీరోయిన్ గా ఛాన్సులు వచ్చేవరకూ వెయిట్ చేయ్” అన్నారు. “అలా కాదు… ” అంటూ నేను నసిగాను. “సురేశ్ ప్రొడక్షన్స్ చాలా పెద్ద కంపెనీ… సినిమా ఎలా వున్నా నీకు మంచి పేరు వస్తుంది… ఇప్పుడు ఫోన్ చేసి నువ్ ఆ పాత్ర చేస్తున్నట్టుగా చెప్పు” అంటూ పట్టుబట్టారు.
దాంతో శ్రీవిద్య గారు చెప్పినట్టు చేశాను… ఈ రోజున ఇక్కడ వున్నాను. నా కెరియర్ మలుపు తిరగడానికి ఆమే కారణం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ‘ఢమరుకం’ సినిమా షూటింగ్ సమయంలో తనకి తల్లి పాత్రను పోషించేది ప్రగతి అని తెలిసి అనుష్క చాలా బాధపడిందట. “ఆ రోజు నేను సెట్స్ లోకి అడుగుపెట్టగానే .. అనుష్కకి తల్లిగా నటిస్తున్నది నేనేననే విషయాన్ని ఆమెకి డైరెక్టర్ చెప్పారు. “అయ్యో పాపం .. ఆవిడ నాకు అమ్మ ఏంటి … ఒకసారి చూడండి ఎంత యంగ్ గా వున్నారో .. ఆమెను తల్లిగా ఎలా అనుకోగలను? అంటూ అనుష్క బుంగమూతి పెట్టేసింది. ‘ఫరవాలేదు… చేస్తాను… నాకు ఓకే’ అని నేను చెప్పాను. అనుష్క మంచి నటి… నాకు తెలిసి అందరితో గుడ్ అనిపించుకున్న హీరోయిన్ తనే అయ్యుంటుందేమో”అంటూ ప్రగతి చెప్పుకొచ్చారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…