Telugu

ప్రకాష్ రాజ్… మీకిది తగునా?ఈసీ

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ‘సర్’ పేరుతో తన పేరుని బెంగళూరు ఓటర్ల జాబితాలో నుంచి తొలగించారని ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. తాను మోడీ ప్రభుత్వాన్ని తాను ప్రశ్నిస్తున్నందునే తనకు ఓటు హక్కు లేకుండా చేయాలని చూస్తున్నారని, కానీ మీ ప్రభుత్వాన్ని గద్దె దించకుండా మమ్మల్ని మీరు ఆపగలరా?” అని ఆ వీడియోలో ప్రశ్నించారు.

ఆయన బెంగళూరులో శాంతి నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పేర్కొని వేరే చోట ఉంటున్నారు. దేశ ప్రజలందరూ తమ ఓటు హక్కుని ధ్రువీకరించుకునేందుకు ఎన్యుమరేషన్ ఫారాలు నింపి సంతకాలు చేసి ఇస్తున్నట్లే ప్రకాష్ రాజ్ కూడా ఇస్తే సరిపోయేది కదా?

ADVERTISEMENT

అయన వీడియోపై ఈసీ స్పందిస్తూ, “అయన ఓటు తొలగించలేదు. సిబ్బంది ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు చాలా కాలంగా ఆయన అక్కడ నివాసం ఉండటం లేదని తెలిసి, చిరునామా మారినట్లు పేర్కొన్నారు. కనుక ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారో తెలియజేస్తూ ఫారమ్-6 సమర్పిస్తే చాలు. ఆ చిరునామాకి ఆయన ఓటు మార్చుతాము,” అని పేర్కొంది.

జిల్లా ఎన్నికల అధికారి జగదీశ్ ఏమన్నారంటే, “ఇటీవలే నేను ప్రకాష్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడు గత నాలుగేళ్ళుగా శాంతి నగర్‌లో ఉండటం లేదని, వేరే చోట ఉంటున్నానని చెప్పారు. ఆ చిరునామాలో ఉన్నట్లు నిరూపించే ధ్రువపత్రాలు సమర్పిస్తే అక్కడికి మార్చుతాము. ఆయన స్థాయి వ్యక్తి తన ఓటు తొలగించారంటూ ప్రజలకు తప్పుడు సమాచారం అందించడం సరికాదు,” అని అన్నారు.

ప్రకాష్ రాజ్‌కి ప్రధాని మోడీని వ్యతిరేకిస్తుంటారు. కనుక అసలు విషయాన్ని దాచిపెట్టి ఈ అవకాశాన్ని అందుకు మరోసారి ఉపయోగించుకున్నారు. కానీ ఈసీ అసలు విషయం బయట పెట్టడంతో ఇప్పుడు ఆయన తలదించుకోవాల్సి వచ్చింది కదా?

అయినా దేశంలో ఎవరెవరి ఓట్లు నమోదవుతున్నాయో… ఎవరెవరివి తొలగిస్తున్నారో.. ఎందుకు తొలగిస్తున్నారో అన్నిటికీ ప్రధాని మోడీయే ఏవిధంగా బాధ్యత వహిస్తారు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47 Postponed: Naga Vamsi’s Deadline Drama Backfires

Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 will miss its October 9 release. Producer Naga Vamsi confirmed…

36 minutes ago

వైసీపీ ‘కోర్టు’లలో యుద్ధం చేస్తుందా.?

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైసీపీ క్యాడర్, లీడర్ అందరు ఎలర్ట్ గా ఉండాలని, ఏకగ్రీవాలకు ఎట్టి పరిస్థితులలోను ఆస్కారం…

47 minutes ago