‘గెలవనివ్వను…గెలవలేడు’…పీకే ల ‘శపధాలు..వైసీపీ కి శాపాలేనా’..?

రాష్ట్రంలో పార్టీల మధ్య ఎన్నికల వేడి రాజుకుంటున్న ఇటువంటి కీలక సమయంలో వైసీపీ ప్రభుత్వం పై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యాయి. 2019 ఎన్నికలకు గాను జగన్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేసి ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన పీకే 2024 ఎన్నికలలో వైసీపీ కి గోరపరాభవం తప్పదని తేల్చేశారు.

హైద్రాబాద్ లో ఒక మీడియా పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పీకే…, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద తన అభిప్రయాన్ని పంచుకున్నారు. త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలలో అధికార వైసీపీ పార్టీకి గోర ఓటమి తప్పదు, రాష్ట్రంలో యువత ఉచితాలు కాదు ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఉచిత పథకాలకు బటన్ నొక్కుతూ, ప్యాలస్ లో పాలన చేసే వ్యక్తులను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరంటూ వైసీపీ కి గట్టి హెచ్చరికలే పంపారు పీకే.

ADVERTISEMENT

సంక్షేమం తో పాటు అభివృద్ధి కూడా జరిగినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలు సంతృప్తిగా ఉంటారంటూ చెప్పిన పీకే ఈసారి జరగబోయే ఎన్నికలలో జగన్ గెలుపు అసాధ్యమని, అధికారంలోకి రాబోయేది టీడీపీ పార్టీయే అని తేల్చిచెప్పారు. ఎన్నిక వ్యూహకర్తగా పని చేసే ఈ పీకే ఈ ఎన్నికలలో జగన్ గెలవలేడు అని తేల్చేస్తే…జనసేన అధ్యక్షుడు పీకే (పవన్ కళ్యాణ్) ఈసారి జరిగే ఎన్నికలలో జగన్ ను గెలవనివ్వను.., పాతాళానికి తొక్కుతా అంటూ శపధాలు చేస్తున్నాడు.

ఇలా ‘గెలవనివ్వను అంటూ ఒకరు…గెలవలేడు అంటూ మరొకరు’ ఈ ఇద్దరి పీకేలు చేస్తున్న శపధాలు… వైసీపీకి, జగన్ కు శాపాలుగా మారనున్నాయా..? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ పై ట్రోల్స్ చేస్తున్నారు. అలాగే గత ఎన్నికలకు జగన్ విజయాన్ని కాంక్షించి ఆయన కోసం పని చేసిన చెల్లి షర్మిల, వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఇద్దరు ఈ ఎన్నికలలో జగన్ ఓటమిని కోరుకోవడం అంతా కూడా దేవుడి స్క్రిప్ట్ లో భాగమేనా అంటూ మిమ్స్ కూడా సిద్ధం చేస్తున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

4 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

5 hours ago