పెద్ద హీరోల సినిమాతో పోటీగా కాదు వారితో కలిసి వస్తున్నాం అంటూ సున్నితంగా చెప్పుకొచ్చిన హను” MAN “చిత్ర యూనిట్ కు సినిమా విడుదలై, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సంక్రాంతి సినిమాల వార్ జరుగుతూనే ఉంది.
కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో క్ ఫేక్ అకౌంట్స్ సృష్టించి మా సినిమా పై నెగిటివిటీ ని స్ప్రెడ్ చేస్తున్నారంటూ ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకున్నారు. ఏది ఏమైనప్పటికిని ధర్మమే గెలుస్తుందని నమ్ముతున్నాను. ఇటువంటి చెత్తను భోగీ మంటలో వేయడం మర్చిపోయాను అంటూ హార్ట్ బ్రేక్ సింబల్ తో తన ఆవేదనను వ్యక్త పరిచారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.
ఎటువంటి స్టార్ కాస్టింగ్ లేకుండా కేవలం కథ, కథనం మీద ఉన్న నమ్మకంతో సంక్రాంతికి విడుదలై స్టార్ కట్ అవుట్ ల సినిమాలను తట్టుకుని నిలబడి ఎవ్వరు ఊహించని మౌత్ టాక్ తో దూసుకుపోతుంది హను MAN. పరిమితమైన బడ్జెట్ తో, తనకున్న టాలెంట్ ను నమ్ముకుని ఇండస్ట్రీ కి వచ్చిన యువ దర్శకుడి ప్రతిభను గుర్తించడానికి కానీ ప్రమోట్ చేయడానికి కానీ సొంత ఇండస్ట్రీ నుంచి పెద్దలుగా చెప్పుకునే నటీనటులు కానీ దర్శకధీరులు కానీ ఎవ్వరు ముందుకు రాకపోవడం దురదృష్టమనే చెప్పాలి.
వైలెన్స్, అడల్ట్ కంటెంట్ గా తెర మీదకు వచ్చిన యానిమల్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపిన మన స్టార్ హీరోల ద్రుష్టి ఈ హనుమాన్ సినిమా పై పడలేదా..? అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఊపందుకుంది. కంతారా,కేజిఫ్ సినిమాల ప్రమోషన్ల మీద పెట్టిన శ్రద్ద మన ఇండస్ట్రీ వారు చిన్న బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన ఈ హనుమాన్ పై ఎందుకు పెట్టలేకపోతున్నారు. పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ గా ఎదిగిన టాలీవుడ్ హనుమాన్ సినిమాను తమ సినిమా గా భావించి ప్రమోషన్లలో తమ వంతు సహకారం అందిస్తే ఇటువంటి మంచి సినిమాల పరిధిని పెంచిన వారవుతారు.
హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి చిరు తన పెద్ద మనసుని మరోసారి చాటుకున్నారు. అలాగే రాఘవేంద్రరావు వంటి సీనియర్ దర్శకుడు సినిమా విజయం పై స్పందిస్తూ దర్శకుడి తో పాటుగా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియచేసారు. ఇలాగే ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్న ప్రముఖులు కూడా సినిమా పై తమ స్పందన తెలియచేసి ఉండుంటే ఈ సినిమా స్థాయి, సినిమా వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉండేది. అలాగే మన ఇతిహాసాల నుండి ఇటువంటి సూపర్ హీరో కథలు మరిన్ని ప్రేక్షకులను అలరించడానికి ముందుకొస్తాయి. మరి వీటిని ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చే పెద్ద మనసున్న పెద్ద మనుషులు ఎవరనేదే ఇక్కడ ప్రశ్న.




