
ఈ సారి ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు జగన్ పాలిట బొమ్మాలి గా మారిపోయారు. జగన్ నిన్ను వదలా అన్నట్టుగా వైసీపీ అంతం కోసం పంతంగా నిలబడ్డారు ఈ ఇద్దరు పీకేలు. ఈసారి వైసీపీ కుంభస్థలం బద్దలు కొట్టి తీరుతాం, జగన్ కు ఓటమి భయం 175 సీట్లలోనూ చూపిస్తాం అంటూ, అందుకు తగ్గట్టుగా తన వ్యూహాలకు పదును పెట్టారు జనసేన అధినేత పీకే.
అయితే 2019 ఎన్నికలలో జగన్ కు మద్దతుగా వైసీపీ అధికారంలోకి రావడానికి వ్యూహాలు వేసిన ప్రశాంత్ కిషోర్ 2024 ఎన్నికలలో జగన్ ఎన్ని వ్యూహాలు వేసినా వైసీపీ గెలిచే అవకాశమే లేదంటూ కుండబద్దలు కొట్టి వైసీపీ కి వ్యతిరేకంగా తన గళం వినిపించడం మొదలు పెట్టారు. “కడుపుకు మించిన ఆహారం అనారోగ్యానికి దారితీసినట్టే, ఆదాయానికి మించిన సంక్షేమం రాష్ట్రానికి చేటు” దాని ఫలితం జగన్ ప్రభుత్వం ఎదుర్కోకతప్పదు అంటూ రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలు కాకముందే బయటపెట్టారు ఈ పీకే.
గత ఎన్నికలలో ఈ ఇద్దరు పీకేలు ఒకరు ప్రత్యక్షంగా జగన్ గెలుపుకు వ్యూహాలు రచిస్తే, మరొకరు జగన్ వ్యూహంలో చిక్కుకుని ఒంటరిగా పోటీ చేసి పరోక్షంగా వైసీపీ విజయానికి మార్గం సులభం చేసారు. అప్పుడు పీకే స్క్వేర్ వలన అధికారం దక్కించుకున్న జగన్ ఇప్పుడే అదే పీకే స్క్వేర్ వలన అధికారానికి దూరం కాబోతున్నారా..? ఈసారి ఎన్నికలలో జగన్ ను ఎట్టి పరిస్థితులలోను గెలవనివ్వను అంటూ టీడీపీ, బీజేపీ లతో పొత్తు పెట్టుకుని ఈ పీకే వైసీపీ కోటలు బద్దలు కొట్టడానికి మూడడుగులతో (టీడీపీ, జనసేన, బీజేపీ) ముందుకొచ్చారు.
ఈసారి జగన్ ఓటమిని ఏ శక్తి ఆపలేదు అంటూ ముందునుంచి మౌత్ పబ్లిసిటీ చేస్తూ వైసీపీ మానసిక స్తైర్యాన్ని దెబ్బ కొట్టారు ఈ పీకే. అయితే తాజాగా ఆయన ఇచ్చిన ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో కూడా జగన్ ఓటమి గురించి మరోసారి స్పందించారు. మొన్న జరిగిన ఐ ప్యాక్ మీట్ లో ప్రశాంత్ కిషోర్ ను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాక్యలను, గతం కంటే ఎక్కువ మెజారిటీ తో ఈసారి కూడా వైసీపీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అంటూ క్యాడర్ కు జగన్ ఇచ్చిన భరోసాను ప్రస్తావించిన యాంకర్ కు తనదైన స్టయిల్ లో బదులిచ్చారు పీకే.
ఎన్నికలలో చివరి నిముషం వరకు అందరూ గెలుస్తాం అనే చెప్తారు… ముందే ఒడిపోతాం అనే వాళ్ళను నా కెరీర్లోనే చూడలేదు. నాలుగు రౌండ్లు పూర్తి అయ్యాకా కూడా ఫలితం దాదాపుగా తెలిసినప్పటికీ మున్ముందు రౌండ్ల లో మాదే మెజారిటీ అంటారే కానీ ఎవ్వరు ఓటమిని ఒప్పుకోరు. జగన్ కూడా అంతే, వైసీపీ గెలుపు మీద జగన్ ఎంత ధీమాగా ఉన్నప్పటికీ జగన్ కు ఓటమి తప్పదని మరోసారి నొక్కి వక్కాణించారు ఈ పీకే.
గెలవనివ్వను అంటూ ఒకరు జగన్ పై ప్రత్యక్షంగా రాజకీయ యుద్ధం చేస్తే…గెలవలేరు అంటూ మరొకరు పరోక్షంగా జగన్ పై మానసిక యుద్ధం చేసారు. మరి ఈ “జగన్ vs పీకే స్క్వేర్” యుద్ధంలో ఎవరు పై చెయ్యి సాధించారో తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు వేచి ఉండాల్సిందే…!
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…
Today, Prime Minister Narendra Modi inaugurated the Vadapalani to Poonamallee stretch of the Phase 2…