రావణ్ కు టీడీపీ రంగు…కానీ వైసీపీ నేతల మద్దతా.?

ప్రశ్న రావణ్ అనే యు ట్యూబర్ వివాదం ఏపీ రాజకీయాలలో విస్తృతంగా చర్చింపబడుతుంది, మరీ ముఖ్యంగా వైసీపీ ఈ వివాదాన్ని మరింత రాజకీయం చేయాలని తెగ ఆసక్తి చూపిస్తుంది.

యు ట్యూబ్ ముసుగులో ప్రశ్న రావణ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, మతపరమైన అంశాలు పై రెచ్చకొట్టే ప్రకటనలు చేయడంతో ఆయన అరెస్టు అనివార్యమయింది.

ADVERTISEMENT

అయితే ప్రశ్న రావణ్ అరెస్టు తరువాత వైసీపీ ఇక్కసారిగా ఆయనకు, ఆయన కుటుంబానికి మద్దతుగా రాజకీయం మొదలుపెట్టింది. ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణిచవేస్తారా అంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ శ్రేణుకులంతా రావణ్ కు మద్దతుగా ప్రకటనలు చేస్తున్నారు, సోషల్ మీడియా పోస్ట్ లు పెడుతున్నారు.

ఇక వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మొదలు యాంకర్ శ్యామల వరకు కూడా రావణ్ కోసం తమ గొంతు విప్పారు, ఎన్డీయే ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు. దీనితో వైసీపీ హిందూ వ్యతిరేకి వాదాన్ని ప్రోత్సహిస్తుందా.? హే రామ్ అంటూ రావణ్ కోసం యుద్ధం చేస్తుందా.? అంటూ వైసీపీ పై సోషల్ మీడియాలో వ్యతిరేకస్వరం వినిపించడంతో ఇప్పుడు రావణ్ విషయంలో వైసీపీ స్వరంలో మార్పు వస్తుంది.

ప్రశ్న రావణ్ టీడీపీ మనిషి అంటూ వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని రావణ్ అరాచకానికి పసుపు రంగు పూసే పనిలోపడ్డారు. ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారి పై ఉప్మా, ఇడ్లి అంటూ కొత్త చట్టాలతో కేసులు పెడుతున్నారని, అయితే ప్రశ్న రావణ్ గత ఏడాది నుంచి కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నా టీడీపీ నుంచి ఎటువంటి ఖండన లేదని,

అలాగే ప్రశ్న రావణ్ ఎక్కడ బాబు, లోకేష్, టీడీపీ పై విమర్శలు చెయ్యలేదని, కేవలం టీడీపీ అనుకూల మీడియా వారిని బూతులు తిట్టటడం, పవన్ ను అంతకు మించి దూషించడమే చేశాడంటూ ప్రశ్న రావణ్ ప్రశ్న ల వెనుక బూతులు ఉన్నాయంటూ ఒక మాజీ బూతుల మంత్రిగా పేరు పొందిన కొడాలి, ప్రశ్న రావణ్ బూతులతో రెచ్చిపోయారని అధికారికంగా ధ్రువీకరించారు.

అయితే ఇక్కడ కొడాలి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు, ఒక వేళ వైసీపీ వాదిస్తున్నట్టు రావణ్ టీడీపీ మనిసి అయితే టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధుల మీద బూతులతో రెచ్చిపోతారా.? టీడీపీ మిత్రపక్షమైన జనసేన అధినేత ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా.?

అసలు ప్రశ్న రావణ్ టీడీపీ మనిసి అయితే వైసీపీ ఆయనకు మద్దతుగా ముందుకొస్తుందా.? ఆయన అరెస్టు అన్యాయం, అప్రజాస్వామ్యం అంటూ గగ్గోలు పెడుతుందా.? వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వైసీపీ నేతలను ప్రశ్న ఇంటికి పంపుతుందా.? అంటే కొడాలి దృష్టిలో టీడీపీ మనిసి కోసం వైసీపీ పోరాడుతుందా.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali US: Advance Sales & Breakeven Target No Sync

Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…

3 hours ago

AK47 New Date: Trivikram About to Break His Promise?

After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…

3 hours ago