పవన్ పై పెరుగుతున్న ఒత్తిడి… మరి పవనేమో..!

Pressure increasing on Pawan Kalyan ‘జనసేన’గా త్వరలో క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని పవన్ ప్రకటించిన నాటి నుండి పవన్ నటించే సినిమాల కంటే కూడా, పవన్ ఎలాంటి ప్రక్రియతో ప్రజల ముందుకు వస్తాడో అన్న ఉత్సుకత నెలకొంది. తాజాగా కేంద్రం నుండి ‘ప్రత్యేక హోదా’పై క్లియర్ కట్ ప్రకటనలు రావడంతో… గత ఎన్నికలలో మోడీని ఆకాశానికేత్తేసిన పవన్ పైనే అందరి చూపులు పడుతున్నాయి.

దీంతో ప్రస్తుతం పవన్ కార్యాచరణ ఏంటి? నేరుగా మోడీ అప్పాయింట్మెంట్ కోరి చర్చలు జరుపుతారా? లేక ఎప్పటిమాదిరిగానే ఒక ట్వీట్ లేక మరొక ప్రెస్ మీట్ తో సరిపెడతారా? ఇలా పవన్ కేంద్రంగా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ఇంతకీ పవన్ ఏం చేయబోతున్నారు అంటే… అంతా అవాక్కయ్యే సమాచారం అందుతోంది. ‘అత్తారింటికి దారేది’ అంటూ పవన్ తన భార్య పుట్టిల్లు అయిన ఆస్ట్రేలియాకు పయనమవుతున్నారని తెలుస్తోంది.

ADVERTISEMENT

ప్రస్తుత సమ్మర్ ను ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారో లేక తన కార్యాచరణకు ముందు కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నారో గానీ పవన్ పోకడ సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకు కాస్త సౌమ్యంగా ఉన్న పవన్, ఇక దూకుడైన తీరును ప్రదర్శించాలని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుతో విసిగిపోయి ఉన్న రాష్ట్ర ప్రజానీకం, కేంద్రాన్ని కడిగేసే బాధ్యతను కూడా పవన్ తీసుకుంటారని ఆశిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories