కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకునే ఛాన్స్ లేదు!

Priyanka Chopra mother Madhu Chopra responds to media on priyanka dressప్రధాని నరేంద్ర మోడీని కలిసిన వేళ, ప్రియాంకా చోప్రా కాళ్లు కనిపించేలా పొట్టి డ్రస్సు వేసుకుని రావడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రియాంక చోప్రా మరో ఫోటో ద్వారా కౌంటర్ ఇవ్వగా, దానిపై కూడా తీవ్రంగా స్పందించారు. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రియాంక చోప్రా తల్లి మధూ చోప్రా తొలిసారిగా స్పందించారు. ముంబైలో ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ….

“సోషల్ మీడియాలో, ఆన్ లైన్ జర్నలిజంలో నిజానిజాలు తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేస్తున్నారని, తన కుమార్తెపై విమర్శలు వచ్చిన తరువాత తానే ధైర్యం చెప్పానని” అన్నారు. “వాస్తవానికి ఆ రోజు ‘బేవాచ్’ ప్రమోషన్ కోసం బయలుదేరిన ప్రియాంక, అనుకోకుండా మోడీని కలవాల్సి వచ్చింది. కనీసం వెనక్కు వెళ్లి మరో డ్రస్ వేసుకునే సమయం కూడా లేదు, అందుకే అదే డ్రస్ లో వెళ్లి పలకరించిందని” వివరణ ఇచ్చారు.

ADVERTISEMENT

ఈ సమావేశం ముందుకు ప్లాన్ చేసుకున్నది కాకపోవడం వల్లే ఇలా జరిగిందని మధు చోప్రా స్పష్టం చేసారు. అయితే అసలేం జరిగి ఉంటుందన్న కనీస విచారణ, వాస్తవాన్వేషణ లేకుండా నాడు తన కుమార్తెను తీవ్రంగా విమర్శించారని దుయ్యబట్టారు. ఇదే విషయం నాడు చెప్పినట్లయితే ఇన్ని విమర్శలు వచ్చేవి కాదు కదా..! మరి ప్రియాంక అలా చెప్పకుండా మరో ఫోటోను పోస్ట్ చేస్తూ రెచ్చగొట్టడం దేనికి? అన్న ప్రశ్నకు మాత్రం జవాబు లేదు.

ADVERTISEMENT
Latest Stories