Telugu

హే ప్రభువా… ఏమిటీ బాధలు నాకు?

జగన్ ప్రతీ బటన్ నొక్కుడు సభల్లో, ఆ తర్వాత ఎన్నికల ప్రచార సభల్లో ఓ మాట ఎప్పుడూ చెపుతుండేవారు. పైన ఆ దేవుడు.. ఎదురుగా మీరందరూ నాకు అండగా నిలుస్తూ, షల్లటి దీవెనలు ఇస్తుండగా ఎంత మంది కట్టకట్టుకు వస్తే మాత్రం నాకేంటి?అనేవారు.

మీ అందరి షల్లని దీవెనెలతో ఆ తోడేళ్ళ గుంపుని సింగిల్ సింహంలా ఎదుర్కొని చీల్చి చెండాడేస్తానని చెపుతుండేవారు. ఆ తర్వాత స్టోరీ అందరికీ తెలిసిందే. దేవుడి స్క్రిప్ట్ లో ఎక్కడో తేడా వచ్చిందన్న మాట!

ADVERTISEMENT

రాష్ట్రంలో పేద ప్రజలని ఉద్దరించేందుకు దివి నుంచి భువికి దిగివచ్చిన భగవత్ స్వరూపాన్ని అని చెప్పుకుంటే, ఫ్లెక్సీ బ్యానర్లు వేయించుకుంటూ, మళ్ళీ తాను పంచిపెట్టే డబ్బు తీసుకొని బ్రతికే పేద ప్రజల దీవెనలు కావాలని జగన్ అడగడం ఏమిటో అర్దం కాదు.

ఒకవేళ ఎన్నికలలో వైసీపీ మళ్ళీ గెలిచి ఉండి ఉంటే తాను దేవుడిననే నమ్మకం జగన్లో పెరిగిపోయేది. కానీ పెరిగే అవకాశం లేకుండా పోయింది.

పైగా ఎన్నికలలో ఒడిపోయినప్పటి నుంచి కష్టాలు, సమస్యలు, సవాళ్ళు, అవమానాలు ఒకదాని తర్వాత మరొకటి వరుసగా తరుముకొచ్చేస్తూ ఊపిరి తీసుకోనీయడం లేదు.

మొదట తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంతో జాతీయ స్థాయిలో జగన్ పేరు మారు మ్రోగిపోయింది. ఆ కల్తీ నెయ్యి ఊబిలో నుంచి ఎలాగో బయటపడ్డామనుకునే సరికి చెల్లి షర్మిల ఆస్తుల పంచాయితీ పెట్టి పరువు తీసింది. ఆ అధ్యాయం కూడా ముగిసి నిట్టూర్పు విడిచేలోగా అదానీ కుంభకోణం బయటపడింది.

పుణ్యకాలమంతా ఇలా నిత్యం ఏదో ఒక అవినీతి మరక తుడుచుకోవడానికి, వివరణ ఇచ్చుకోవడానికే సరిపోతోంది. సందట్లో సడేమియా అన్నట్లు మద్యలో జయమంగళం వంటివారు రాజీనామాలు మొహాన్న కొట్టిపోతున్నారు.

పోతే పోయారు.. కానీ లంక గురట్టు బయటపెట్టేస్తూ జగన్ పరువు తీసేస్తున్నారు. విభీషణుడు వెళ్ళి రాముడి పంచన చేరి, రావణ వధకి తోడ్పడిన్నట్లు, నాడు జగన్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస రెడ్డి ఇప్పుడు అధికార జనసేనలో ఉండటం బహుశః గుబులు పుట్టిస్తూనే ఉంటుంది.

ఇక్కడితో అయినా ఈ బాధలు, సమస్యలు తీరుతాయా?అంటే అనుమానమే. కానీ మన కష్టాలు రెండేళ్ళ ముందుగా అంటే 2027లో జరుగబోయే జమిలి ఎన్నికలతో తీరిపోతాయని జగన్ తనకి తాను సర్ధి చెప్పుకుంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ అంతవరకు పార్టీలో ఎంత మంది మిగిలి ఉంటారో?రెండు రోజుల క్రితమే బొత్స సత్యనారాయణ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి అందరూ చూస్తుండగా షేక్ హ్యాండ్ ఇచ్చారు! కనుక ఆయన జగన్ కి కూడా హ్యాండ్ ఇస్తారని అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి.

హే ప్రభూ.. నాకే ఇన్ని కష్టాలు ఎందుకు?తిరుమల విషయంలో నా మాటలను నువ్వు కూడా నన్ను అపార్ధం చేసుకున్నావా.. ఏంటి?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

H-1B Applicant Arrested Over False Walmart Accusation

An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…

1 hour ago

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

6 hours ago