అనిల్ సుంకర లాంటి నిర్మాతలను కాపాడుకోవాలి

ఇప్పుడు సోలో గానే సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీకి వచ్చిన 13 ఏళ్లలో యాభై సినిమాలకు పైగా చేశారు సుంకర. వీటిలో ప్లాపులే ఎక్కువ అయితే నాన్ – స్టాప్ గా సినిమాలు చేస్తూ పోతూనే ఉన్నారు.

ADVERTISEMENT

అయితే చిన్న చిన్న ప్లాపులు ఆయనను పెద్దగా ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఈ సంవత్సరం మాత్రం ఏజెంట్, భోళా శంకర్ తో వరుసగా రెండు ప్లాపులు.. దాదాపుగా 100 కోట్ల నష్టం. ఏజెంట్ వివాదం ఇంకా కోర్టులో ఉంది.

భోళా శంకర్ కు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కొన్ని ఆస్తులు కూడా తాకట్టు పెట్టాల్సి వచ్చింది. అన్ని ఓర్పు గా భరిస్తున్నారు. భోళా కు సంబంధించే చిరంజీవికి ఇంకా బాకీ ఉన్నారు.

అలాగే ఇంతగా లాస్ అయ్యారు కాబట్టి చిరంజీవి ఇంకో సినిమా తక్కువకు చేస్తారని ఆయన ఆశ. ఆ ఆశతోనే ఎంత ఇబ్బంది పడినా చిరంజీవిని మాట పడనివ్వడం లేదు ఆయన.

ఇకపోతే అనిల్ లాంటి నిర్మాతలను ఇండస్ట్రీ తరిమేస్తే ఇండస్ట్రీకే నష్టం. ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల కారణంగా రెగ్యులర్ నిర్మాతలు కరువైపోతున్నారు. దిల్ రాజు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సితారా నాగవంశీ లాంటి వాళ్ళు తప్ప వరుసగా సినిమాలు తీయడం లేదు.

సురేష్ బాబు, అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఎప్పుడో సైలెంట్ అయిపోయారు. ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.

13 ఏళ్లలో అనిల్ 50 సినిమాలకు పైగా చేశారంటే మాములు విషయం కాదు. ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో మనీ రొటేషన్ అవుతుంది అలాగే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.

ఇటువంటి టైమ్ లో ఇలాంటి నిర్మాతలను కాపాడుకోవాలి. వాళ్ళు ఇండస్ట్రీ నుండి పారిపోకుండా చూసుకోవాలి.

ఆయన జడ్జ్మెంట్ లోపాలు ఉన్నాయి అనడం కాదనలేని విషయం. అయితే ఈ రోజుల్లో నిర్మాతల కంట్రోల్ లో ఏదీ లేదు. డైరెక్టర్ దగ్గర నుండి కథల వరకు అన్నీ పెద్ద హీరోల నిర్ణయాలే..

అది సరిపోదు అన్నట్టు… ఒక స్టార్ హీరో – యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ సెట్ చేస్తే డైరెక్టర్ రెమ్యూనరేషన్ సేవింగ్ ప్రొడ్యూసర్ కి వెళ్ళదు… అక్కడ సేవ్ అయ్యింది కదా అని ఆ 10-15 కోట్లు హీరో నే తీసేసుకుంటున్నారు.

బిజినెస్ తో సంబంధం లేకుండా మా రెమ్యూనరేషన్ మాకు ఇవ్వాల్సిందే అంటూ కూర్చుంటే నిర్మాత మనుగడ ఎలా? ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే అనిల్ సుంకర వంటి వాళ్ళు అమెరికా లో వ్యాపారానికే పరిమితం అయిపోతారు.

ఎక్కువ రెగ్యులర్ నిర్మాతలు లేకపోతే ఆటోమేటిక్ గా సినిమాలు చేసే ఒకరిద్దరు నిర్మాతలు అప్పుడు హీరోలను శాసిస్తారు. అందుకే అనిల్ సుంకర లాంటి నిర్మాతలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

GV Prakash Kumar Impressed with Chakkora’s Dam Dam

The second single from Chakkora – Lunar Love Bird, “Dam Dam,” has been released with…

3 minutes ago

అప్పుడూ ఇలాగే కళ్ళు మూసుకోమన్నారు…

అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీలైనా తమ మనసులో ఆలోచనలు, కోరికలనే ప్రజలకు ఆపాదిస్తూ వాటిని ప్రజాభిప్రాయంగా అభివర్ణిస్తుంటాయి. అధికార…

11 minutes ago