ప్రొఫెసర్ గారి రాజకీయం…ముగిసిన అధ్యాయమా.? తెరిచిన పుస్తకమా.?

Prof Nageswara Rao Row Sparks Fresh Political Debate in AP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలోకి ఒక అంశం వివాదంగా మారితే ఆ మంట అంత ఈజీ గా చల్లారదు అనేదానికి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఉదంతమే చక్కటి ఉదాహరణ.

ఏపీ డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో జగన్ అరెస్టు కోసం చర్చలు జరిపారు అంటూ నాగేశ్వరరావు చేసిన రాజకీయ విశ్లేషణ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ vs నాగేశ్వరరావు గా మారింది.

ADVERTISEMENT

అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలను పై ఇరు వర్గాలు తమ తమ వాదన వినిపించారు. ఇటు జనసేన పార్టీ తరుపున నాగేశ్వరరావు చేసిన నిరాధారమైన ఆరోపణలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ రాగా అందుకు అటు నాగేశ్వరరావు కూడా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

అయితే ఇక్కడితో ఇక ఈ వివాదానికి ఒక ఎండ్ కార్డు పడిందిలే అనుకునే లోపే ప్రొఫెసర్ పై కేసులు, ఆయనకు ఏపీ పోలీసుల నుంచి నోటీసులు, నాగేశ్వరరావు అరెస్టుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇక దీనితో ఇరు వర్గాల అభిప్రాయ భేదాలకు ప్రాంతీయ రంగు పూయడానికి కవిత తెరాస తో రంగంలోకి దిగారు.

ఇకఇదిలా ఉంటే అటు రాజమండ్రి పర్యటనలో ఉన్న పవన్ సైతం నాగేశ్వరరావు వ్యాఖ్యల పై తన స్పందనను చాల ఘాటుగా ఇచ్చారు. అలాగే నాగేశ్వరరావు అరెస్టు పై వచ్చిన వార్తల పై కూడా పవన్ అటువంటి చర్యలు వద్దని వారించినట్టు సమాధానం చెప్పారు.

నాగేశ్వరరావు కూడా తనకు ఏపీ పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదని, తన ఇంటికి తన అరెస్టు కోసం ఏ అధికారులు రాలేదంటూ స్పష్టత ఇస్తూ ఇక ఇది ఒక ‘ముగిసిన అధ్యాయం’ ఇక్కడైతే ఈ వివాదానికి ముగింపు పలకండి అంటూ అందరికి పిలుపునిచ్చారు.

అయితే ఇదొక ముగిసిన అధ్యాయం అంటూ నాగేశ్వరరావు ఇప్పుడే కథ మొదలుపెట్టారా అన్నట్టుగా ఆయన ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిచే ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టుగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏపీలో తన పై నమోదైన కేసుల పై స్పందించారు.

తన పై ఏపీలో నమోదైన కేసులను చూస్తే నవ్వొస్తుంది, నేను కుల చిచ్చు పెట్టనంటూ పవన్ సైతం మాట్లాడుతున్నారు, నేను ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎక్కడా కులం పేరు ప్రస్తావించలేదు, తెలంగాణలో ఉండే నువ్వు ఏపీ రాజకీయాల గురించి ఎలా మాట్లాడతావు అంటూ నా పై మాటల దాడి చేస్తున్నారు,

మరి ఆంధ్రాలో రాజకీయం చేస్తున్న వారు తెలంగాణలో ఇళ్లు, ఆస్తులు కలిగి ఉంటున్నారు, ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, అది తప్పు కాదు కానీ నేను ఏపీ రాజకీయాల గురించి తెలంగాణలో మాట్లాడం తప్పా.? ఎక్కడో అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం పై ఇక్కడ విశ్లేషణలు న్యాయమే కానీ పక్క రాష్ట్ర రాజకీయాల గురించి కనీసం ఇక్కడ మాట్లాడకూడదా.? అంటూ ముగిసిన అధ్యాయాన్ని తిరిగి తెరిచారు నాగేశ్వరరావు.

మరి చర్యకు ప్రతి చర్య మాదిరి నాగేశ్వరరావు విమర్శలకు, ప్రశ్నలకు జనసేన నుంచి కౌంటర్లు, జవాబులు వస్తాయేమో లేదా ఇదొక ముగిసిన అధ్యాయమే అన్న నాగేశ్వరారావు ప్రకటనకు జనసేన కట్టుబడి ఉంటుందో చూడాలి..!

ADVERTISEMENT
Latest Stories