Telugu

నాగేశ్వరరావు ‘ప్రొఫిసర్ ఆఫ్ వైసీపీ’.?

గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన ప్రొఫిసర్ నాగేశ్వరరావు కామెంట్స్ చిలికి చిలికి పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. ఇప్పటికే నాగేశ్వరరావు కామెంట్స్ పై జనసేన నేత మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.

నాగేశ్వరరావు తమ పార్టీ అధినేత పవన్ మీద, తన మీద చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, లేకుంటే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డెడ్ లైన్ విధించింది. ఇక నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ సోషల్ మీడియా సైతం తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.

ADVERTISEMENT

రాజకీయ విశ్లేషకుడు అంటున్న నాగేశ్వరరావు వైసీపీ కండువా కప్పుకున్నారా అనేలా మెడలో వైసీపీ కండువా తో ఉన్న నాగేశ్వరరావు ఫోటోను పోస్ట్ చేసింది. అయితే ఇదే అంశం గురించి నేడు జగన్ ను ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

అందుకు జగన్ కూడా అమిత్ షా ఎక్సపీరియన్స్ ఉన్న వ్యక్తి, ఆయన కు చంద్రబాబు తెలుసు, జగన్ తెలుసు, బాబు పాలన చూసారు, జగన్ పాలన కూడా చూసారు, ఆయనే కాదు రాష్ట్ర ప్రజలందరు చూసారు, ఎవరి నోట్లో నుంచైనా ఇలాంటి మాటలే వస్తాయి అంటూ బదులిచ్చారు.

అయితే ఇంతకీ అసలు ఈ మూడు పార్టీల మధ్య ఇంత పెద్ద వివాదానికి కారణమైన ఆ ప్రొఫిసర్ నాగేశ్వరరావు మాటలు ఏంటో ఒక్కసారి చూద్దాం… నాకున్న హైలీ సోర్సెస్ నుంచి చెపుతున్నా అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ఇద్దరు కలిసి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను కలిసారని,

మనం జగన్ ను లోపలెయ్యాలని, అందుకోసం మావాళ్ళ నుంచి ఒత్తడి వస్తుందని, పవన్ షా ను అడిగితే అందుకు షా పవన్ కు ఈ విధంగా రిప్లై ఇచ్చారని, రాజకీయాలలో ఇన్స్టంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు, బాబు ఇన్స్టంట్ ఫ్రెండ్ లాంటివాడని, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని,

బాబు కి ఆయనంటే శత్రుత్వం ఉండొచ్చు, కానీ మనకేంటి.? మీకు కూడా మంచి చెపుతున్నా, ఎప్పటికైనా లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు, మనకి 25 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు కదా అంటూ పవన్ షా ముందు పెట్టిన జగన్ అరెస్టు ప్రపోజల్ ను షా సున్నితంగా తిరస్కరించారు అంటూ నాగేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలు గత రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే నాగేశ్వరరావు చెప్పినట్టుగా జగన్ ను జైలుకు వెళ్లకుండా షా కాపాడుతున్నారా.? అలా అయితే మోదీ, బాబు, పవన్ లకు అంత ప్రాధాన్యం ఇస్తారా.? తాజగా హైద్రాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ పవన్ ను పరామర్శించేందుకు, బాబుతో ముచ్చటించేందుకు స్వయంగా వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాలతో ఆప్యాయంగా గడుపుతారా.?

రాజకీయ పార్టీల అధినేతల అరెస్టులు అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటాయి. ఎన్నో రాజకీయ లెక్కలు, మరెన్నో క్షేత్ర స్థాయి వాస్తవాలు పరిగణలోకి తీసుకుని అరెస్టులు జరుగుతుంటాయి. ఇందులో కొందరు అగ్రిసివ్ గా ముందుకెళితే మరికొందరు ఆచితూచి ఆడుగులేస్తారు. అవన్నీ వారి రాజకీయ విధానాలు.

ఏదిఏమైనా కాలం, కర్మమం కలిసి రాకపోతే ఎదోఒకరూపంలో అరెస్టులు జరగక తప్పదు. అందుకు జగన్ మినహాయింపు కారు, బాబు కూడా కాదు అనేది గత చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. ఇందుకోసం నాగేశ్వరరావు జగన్ ను షాకు, బీజేపీ కి లాంగ్ టర్మ్ స్నేహితుడిగా చిత్రీకరిస్తూ బాబు ని తక్కువ చేస్తూ కూటమిలో చిచ్చులు పెట్టె అవసరం ఏముంది.?

పవన్ కూడా బాబు తో కొన్ని అంశాలలో విభేదిస్తున్నారని, అందుకే మొన్న జనసేన పార్టీ సమావేశంలోను జై అమరావతి బదులు జై ఆంధ్రా అనాలంటూ పిలుపిచ్చారని ఒక పొంతన లేని విషయాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. పవన్ – బాబు కి మధ్య విభేదాలంటూ కల్లబొల్లి కబుర్లతో, షా కు జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటూ ప్రచారాలతో నాగేశ్వరరావు ప్రొఫెసర్ ఆఫ్ వైసీపీ నా అంటూ టీడీపీ, జనసేన శ్రేణుల నుంచి కౌంటర్లు పేలుతున్నాయి.

టీడీపీ, జనసేన ల మధ్య రాజకీయ చిచ్చు పెట్టేందుకు బీజేపీ ని కూటమికి దూరం చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆదిలోనే అంపశయ్య ఎక్కడంతో వైసీపీ రాజకీయ విశ్లేషకుల రూపంలో ఉండే వైసీపీ మద్దతుదారులను తనకు అనుకూలంగా వాడుకుంటుందా.? అందులో ప్రొఫిసర్ నాగేశ్వరరావు కూడా ఒక పావుగా మారారా.? అంటూ సోషల్ మీడియాలో నాగేశ్వరరావు పై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురవుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

SRH Vs RCB Tomorrow: WTH Is Happening With Tickets?

Virat Kohli is one of the biggest superstars in Indian cricket, and he has a…

27 minutes ago

What Happened To That Intelligent NTR?

There are a few actors who are smart with their choices, and there are a…

57 minutes ago