సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇప్పటికే నిర్మాతలు ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా కూడా అప్పుడే విడుదల చెయ్యనున్నట్టు సమాచారం. మహా శివరాత్రికి ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. ఆ రోజునే సంక్రాంతికి విడుదల చేయబోతున్నాం అని ప్రకటన కూడా అదే రోజు రాబోతుందట.
సంక్రాంతి అంటే అటుఇటుగా 10 నెలల సమయం ఉంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయి. మా సినిమా గొప్ప ఆంటే మా సినిమా గొప్ప అంటూ జబ్బలు చరుస్తున్నారు. 2020 సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంటాపురములో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు రెండూ క్లాష్ అయ్యాయి. చివరికి అల్లు అర్జున్ సినిమా దే పై చెయ్యి అయ్యింది. ఇప్పుడు అదే జరుగుతుందని మెగా ఫ్యాన్స్ గొప్పలు చెబుతున్నారు.
అదే సమయంలో 2020లో తప్పించుకున్నారు ఈ సారి మా ప్రతాపం చూపిస్తాం అంటూ మహేష్ బాబు అభిమానులు ప్రగల్బాలు పలుకుతున్నారు. ఎప్పుడో ఏడాది తరువాత వచ్చే సినిమాలు… అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. దానికి ఇప్పటినుండే హడావిడి మొదలు పెట్టేశారు. పవన్ కళ్యాణ్ క్రిష్ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొదటి పీరియడ్ సినిమా. దానితో ఆ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఫస్ట్ లుక్ విడుదలతో సినిమా మీద మరింత క్లారిటీ వస్తుంది.
మరోవైపు.. సర్కారు వారి పాటలో మహేష్ బాబు చాలా కాలం తరువాత కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఆ లుక్ కి సంబంధించిన పోస్టర్లు విడుదల కావడంతో అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ మీద మహేష్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడాలి ఈ రెండు సినిమాలలో చివరికి ఏ సినిమాది పై చెయ్యి అవుతుందో!





