
ముఖ్యమంత్రులతో సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పదవులకు వయో పరిమితి, రైటర్మెంట్ రెండూ ఉండవు. ఎవరికి ఓపిక ఉన్నంతవరకు వారు ‘ప్రజాసేవ’ చేసుకోవచ్చు. వారికి కనీస విర్యార్హతలు కూడా అవసరం లేదు. పార్లమెంట్, శాసనసభ సమావేశాలకు తప్పనిసరిగా హాజరవ్వాల్సిన అవసరం లేదు.
పేదలకు పించన్లు అందడంలో ఆలస్యం కావచ్చేమో కానీ ప్రజాప్రతినిధులకు టంచన్‌గా నెలనెలా జీతభత్యాలు అకౌంటులో పడిపోతుంటాయి. వారి జీతభత్యాలులు వారే ఏకగ్రీవంగా పెంచేసుకోవచ్చు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరూ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకుంటూనే ఉంటారు. వేలు, లక్షల కోట్లు సంపాదించుకుంటూనే ఉంటారు.
మన ప్రజా ప్రతినిధుల విషయంలో నియమ నిబంధనలు ఇంత ఉదారంగా ఉంటే, ఓ ప్రభుత్వోద్యోగి, ఉపాధ్యాయుడు, లెక్చరర్, కానిస్టేబుల్, ఆర్టీసీ డ్రైవర్, ఐఏఎస్, ఐపీఎస్ తదితరులకు కనీస అర్హతలు, అనుభవం ఉండాలి. పోటీ పరీక్షలు పాస్ అవ్వాలి. రోజూ విధిగా డ్యూటీకి రావాలి. వచ్చినట్లు నిరూపించుకోవాలి.
సమర్ధంగా పనిచేయాలి. ఎటువంటి సైడ్ బిజినెస్‌లు చేయరాదు. రాజకీయాలకు దూరంగా ఉండాలి! సకాలంలో ప్రభుత్వం జీతాలు, బకాయిలు చెల్లించకపోయినా ఎవరూ నోరెత్తి మాట్లాడకూడదు. వాటి కోసం సమ్మెలు చేయకూడదు.
ఎందుకింత తేడా? అని ఎవరూ అడగరు. అడిగినా ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెం ప్రభుత్వ హైస్కూల్ ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు పనిచేస్తున్న భూక్య గౌతమిని జిల్లా డీఈవో సస్పెండ్ చేశారు. దేనికంటే ఆమె నిబంధనలకు వ్యతిరేకంగా రీల్స్ చేస్తునందుకు… ప్రైవేట్ విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలకి ప్రమోషన్స్ చేస్తున్నందుకు!
సస్పెన్షన్ వేటు కంటే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తట్టుకోవడమే చాలా కష్టంగా ఉందని ఆమె వాపోయారు. మానసికంగా చాలా క్రుంగిపోయానని ఇకనైనా తనని విడిచిపెట్టమని కన్నీళ్ళు పెట్టుకొంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు
ఇలా చేయడం తప్పని తెలియదని, ఎవరైనా వారించి ఉన్నా ఇలాంటి తప్పు జరిగేది కాదన్నారు. చాలా మంది తనను ప్రోత్సహించడంతో మంచి పనే చేస్తున్నాను కదా అనుకుంటూ రీల్స్, ప్రమోషన్స్ చేశానన్నారు.
ఈ ఒక్కసారికి తనకు క్షమిస్తే జీవితంలో మళ్ళీ ఎన్నడూ ఇలాంటి తప్పు చేయనని బోరున ఏడుస్తూ చేతులు జోడించి సోషల్ మీడియాలో కనిపించని వారిని వేడుకున్నారు.
ఓ ఉపాధ్యాయురాలు ఈవిధంగా చేయడం తప్పే కావచ్చు. కానీ ప్రజా ప్రతినిధుల అవినీతిని, అక్రమాలను, వ్యాపారాలను ప్రశ్నించే సాహసం లేని సోషల్ మీడియాలో ఆమెను ఎందుకు వెంటబడి వేధిస్తోంది?
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…