‘ఎమ్మెల్యే’ కాళ్ళకు మొక్కిన ‘గవర్నర్’

puducherry-governor-kiran-bediమహిళా ఐపీఎస్ గా దేశంలోని జైళ్లలో సంస్కరణలు తెచ్చిన కిరణ్ బేడీ తాజాగా పుదుఛ్ఛేరి గవర్నర్ గా విధులు స్వీకరించారు. ఈ సందర్భంగా పుదుచ్ఛేరి ఎమ్మెల్యేలంతా బేడీని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయవాణి శాలువతో సత్కరించి, కిరణ్ బేడీ కాళ్లకు నమస్కరించారు. అయితే, ఆమెను పైకి లేపిన గవర్నర్ కిరణ్ బేడీ… ‘మహిళలు సొంత కాళ్లపై నిలబడాలని… అలా ఎవరి కాళ్లకూ నమస్కరించవద్దని, ఇంకెప్పుడూ అలా చేయవద్దని…’ సూచించారు.

అయితే సదరు ఎమ్మెల్యే గారి నుండి ప్రతిస్పందన వచ్చే సమయం లోపే… తన కాళ్ళకు నమస్కరించిన ఎమ్మెల్యే కాళ్ళకు మొక్కారు గవర్నర్ కిరణ్ బేడీ. తాజాగా దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సామాజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ఒక ‘గవర్నర్’ అయి ఉండి కిరణ్ బేడీ ఒక ఎమ్మెల్యే కాళ్ళకు నమస్కరించడంపై… దటీజ్ కిరణ్ బేదీ అంటూ నెటిజన్లు అభిమానం చాటుతున్నారు. ఈ ఎపిసోడ్ అంతా ముగిసిన తర్వాత, ‘పుదుచ్ఛేరిని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుదామని’ పిలుపునిచ్చిన బేడీ… పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులను శుభ్రం చేశారు.

ADVERTISEMENT

puducherry-governor-kiran-bedi

ADVERTISEMENT
Latest Stories