
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కొన్ని నియోజకవర్గాలలో రాజకీయ పార్టీల మధ్య జరిగే స్థానిక సంస్థల పోరు కూడా రసవత్తరంగా మారుతుంది, హోరాహోరీగా సాగుతుంది. అందులో వైస్ కుటుంబానికి కంచుకోటగా చెప్పబడే పులివెందుల నియోజకవర్గం ఒకటనే చెప్పాలి.
ఈ నెల 12 న జరగనున్న పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోరుకి వైసీపీ, టీడీపీ సిద్దమయ్యాయి. టీడీపీ నుంచి జిల్లా ఇంచార్జ్ బీటెక్ రవి సతీమణి మర్రెడ్డి లతా రెడ్డి బరిలోకి దిగగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసారు.
ఇక వైసీపీ నుంచి మహేశ్వర రెడ్డి తనయుడు హేమంత్ రెడ్డి బరిలోకి దిగనున్నారు. అయితే ఈ ఉపఎన్నికలలో గెలుపు అనేదే రెండు పార్టీలకు అత్యంత కీలంగా మారింది. ఇటు టీడీపీ విషయానికొస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కే సూపర్ సిక్స్ వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు దిశగా ప్రభుత్వం అడుగులేయడం,
టీడీపీ ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో ఒకటైన మహానాడు కడప జిల్లా కేంద్రంగా నిర్వహించడం, 2024 ఎన్నికలలో టీడీపీ తన గెలుపుతో ఈ జిల్లాలో పట్టు సాధించడం తో పాటుగా జిల్లా ఇంచార్జ్ భార్యయే బరిలోకి దిగడంతో టీడీపీ ఈ ఉపఎన్నిక గెలుపు మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఇక వైసీపీ పరిస్థితి గురించి పరిశీలిస్తే, పులివెందుల వైస్ కుటుంబానికి కంచు కోట కావడం వైస్ జగన్ ను కాదని పులివెందుల ప్రజలు మరో పార్టీ వైపు చూసే అవకాశం లేదు అనేది వైసీపీ భావన. దానికి తోడు మహేశ్వర రెడ్డి మరణంతో ఏర్పడిన ఉప ఎన్నికలు కావడంతో పార్టీ తో పాటు ఆయన కుటుంబం పై ప్రజలలో ఉండే సింపతీ కూడా వైసీపీ గెలుపుకు తోడవుతుంది అనేది వైసీపీ ఆలోచనగా కనిపిస్తుంది.
అయితే ఈసారి సార్వత్రిక ఎన్నికల మాదిరే కూటమి కలిసి కట్టుగా పనిచేసి పులివెందుల వంటి వైసీపీ కంచుకోటలు బద్దలుకొట్టాలి అనేది టీడీపీ వ్యూహం. అందులో భాగంగానే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సైతం పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల పై ద్రుష్టి సారించారు.
పులివెందుల లో వైసీపీ ఓటమి అంటే అది పూర్తి గా వైసీపీ ని పాతాళంలోకి నెట్టినట్టే అవుతుంది, తద్వారా వైసీపీ ఆ పార్టీ క్యాడర్ ను లీడర్లను నైతికంగా దెబ్బకొట్టినట్టే అవుతుంది. అలాగే టీడీపీ తో పాటుగా కూటమి పార్టీలలో కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
పరామర్శల పేరుతో, ఓదార్పు యాత్రలో ఇన్నాళ్ళుగా వైసీపీ చేస్తున్న బలప్రదర్శన క్షేత్ర స్టేయిలో ఎలా ఉంది.? అది వైసీపీ బలమా.? వాపా.? అనేది కూడా ఈ ఎన్నికలతో వైసీపీ, టీడీపీ లతో పాటు సామాన్య ప్రజానీకానికి సైతం స్పష్టత వస్తుంది. ఇక ఒంటిమిట్ట లో కూడా ఈ జడ్పీటీసీ పోరు ఉన్నప్పటికీ పులివెందులలో ఉన్న హోరుజోరు అక్కడ అంతగా కనిపించడం లేదు.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…