
పులివెందుల వైస్ జగన్ అడ్డా, వైసీపీ కంచుకోట అంటూ మీసాలుమెలేసి, తొడలుకొట్టిన వైసీపీ పెద్దలు ఇప్పుడు కేవలం 10 వేల ఓట్లు ఉన్న జడ్పీటీసీ ఎన్నికల కోసం బాబుకి ఎందుకింత పంతం, టీడీపీ కి ఎందుకంత పట్టుదల అంటూ మీడియాలో ఓటమి తాలుకా భయాన్ని, బాధను వ్యక్తపరుస్తున్నారు.
ఇక కడప వైసీపీ ఇంచార్జ్, జగన్ సోదరుడు, వైస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికలలో మనకు, మన పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఇక ఇక భవిష్యత్ ను ఎలా ఎదుర్కోవాలి అనే దాని పై ద్రుష్టి పెడదాం అంటూ పార్టీ క్యాడర్ ను వైసీపీ ఓటమికి సిద్ధం చేస్తున్నారు.
ఇన్నేళ్ల చరిత్రలో ఏనాడైనా టీడీపీ పులివెందులలో గెలిచిందా.? ఇప్పుడెలా గెలుస్తుంది.? ఇది కేవలం అధికారులను అడ్డుపెట్టుకుని ఒక ప్రభుత్వం చేసిన అరాచకం అంటూ వైసీపీ నేతలు గుండెలు బాదుకుంటు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇదంతా నాడు వైసీపీకి కుప్పం మున్సిపాలిటీ గెలిచినప్పుడు తెలియలేదా.?
నాడు వైసీపీ కుప్పంలో చేసింది సంసారం అయినప్పుడు నేడు టీడీపీ పులివెందులలో చేసింది అరాచకం ఎలా అవుతుంది.? నాటి జగన్ దుర్మార్గాలు నేడు వైసీపీ ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి అనే చేదు నిజాన్ని వైసీపీ నాయకులు ఇప్పటికి అంగీకరించలేకపోతున్నారు.
అయితే నేడు పులివెందుల టీడీపీ పోరుకి ప్రజాస్వామ్యం ఖునీ అయిపొయింది, అరాచకం రాజ్యమేలుతుంది, అక్రమం పాలన సాగిస్తుంది, అధికారులు ప్రభుత్వానికి బానిసలయ్యారు ఇంతలా గింజుకుంటున్న వైసీపీ గత 30 ఏళ్లుగా పులివెందులలో చేస్తుంది ఏమిటి.?
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అనేవాడే లేకుండా, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా భావించే ఎన్నికలే జరగకుండా, నియంతలా పులివెందులకు నిర్దేశిస్తున్న వైఎస్ కుటుంబం ఇన్నాళ్ల తరువాత ప్రజాస్వామ్య విధానంలో బ్యాలట్ పద్దతి ప్రకారం ఓటింగ్ నిర్వహిస్తే సహించలేక పోవడానికి కారణం చెప్పగలరా.?
ఏకగ్రీవాలు వైసీపీకి రాజ్యాంగ బద్దమా.? ఇవి ప్రజాస్వామ్యానికి ప్రతీకలా.? కనీసం పులివెందులలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా నామినేషన్ వెయ్యడానికి కూడా స్వేచ్ఛ లేని వాతావరణం వైసీపీ లక్ష్యమా.? ఇన్నాళ్ల తమ నియంతృత్వాన్ని ఓటింగ్ తో పులివెందుల ప్రజలు తిరస్కరిస్తున్నారు అనే భావన వైసీపీ ని కాడే వదిలేసేలా చేసిందా.?
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…