ఈ మంత్ ఎండ్ లో ‘రొమాంటిక్’ ఫ్రైడే!

Puri Jagannad Romantic on Ahaపూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ హీరోగా నటించిన “రొమాంటిక్” సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయింది. రెగ్యులర్ పూరీ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది.

నవంబర్ 26వ తేదీన ఆహాలో “రొమాంటిక్” విడుదల కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది. సినీ విమర్శకుల చేత ఆశించిన ఫలితాన్ని అందుకోలేని ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కేతిక శర్మ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.

ADVERTISEMENT

ఈ నెలలో ప్రతి వారం ఓ కొత్త సినిమాను తీసుకువస్తున్న అల్లు అరవింద్ ఆహా, ఈ వారంలో అక్కినేని అఖిల్ – పూజా హెగ్డేల కాంబోలో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”ను ప్రేక్షకుల ముందు ఉంచబోతోంది.

ADVERTISEMENT
Latest Stories