
అయితే తాజాగా ‘ఇజం’ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న దర్శకుడు పూరీ జగన్నాధ్ కు ఈ ప్రశ్న ఎదురయ్యింది. ప్రిన్స్ తో మూవీ ఎప్పుడు ఉంటుంది? అన్న ప్రశ్నకు తన సైడ్ నుండి పూర్తి స్పష్టత ఇచ్చారు పూరీ. “జనగణమన” అనే స్క్రిప్ట్ సిద్ధమైందని, మహేష్ కు వినిపించానని, తనకు కూడా నచ్చిందని, ప్రస్తుతం మహేష్ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నానని… పూరీ స్పష్టంగా చెప్పడంతో, ప్రస్తుతం బాల్ మహేష్ కోర్టులో ఉందన్న విషయం అవగతమైంది.
మరి మహేష్ సినిమాల జాబితాను పరిశీలిస్తే… ప్రస్తుతం మురుగదాస్ సినిమా తర్వాత, కొరటాల శివతో ఒక చిత్రానికి కమిట్ అయ్యారు. ఆ తర్వాత 25వ సినిమా త్రివిక్రమ్ చేతుల్లో పడగా, వంశీ పైడిపల్లితో మరొక సినిమా ప్రకటన వెలువడింది. అయితే పూరీకి బల్క్ డేట్స్ అవసరం ఉండదు గనుక, మధ్యలో ఏ మూడు నెలల సమయం చిక్కినా పూరీ సినిమాను పూర్తి చేసేయవచ్చు. ప్రిన్స్ అభిమానులు మాత్రం ఈ కాంభినేషన్ వీలైనంత త్వరగా పట్టాలెక్కాలని కోరుతున్నారు.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…