Telugu

ఇంతకీ ఆ “బోర్ కొచ్చిన బండి ఏ ట్రావెల్స్” లో ఉందో.?

వైసీపీ లోకి కేశినేని నాని ఎంట్రీ తరువాత విజయవాడ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇంటా బయట కేశినేని పై విమర్శల దాడి కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్ళుగా తనకు రాజకీయ అవకాశం కల్పించిన టీడీపీ పార్టీని మోసం చేసి వైసీపీ కోవర్డ్ మాదిరి నాని పార్టీ మారాడు అంటూ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు.

అలాగే కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని కూడా చంద్రబాబు పై నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ బాబు కి మద్దతుగా నిలబడ్డారు. కేశినేని నాని తన వ్యక్తిగత స్వార్థం కోసం బాబు పై ఆరోపణలు చేసారని అందుకు కేశినేని కుటుంబ సభ్యుడిగా నేను చంద్రబాబుకి క్షమాపణలు తెలియచేస్తున్నా అన్నారు. మా రెండు కుటుంబాల మధ్య సమస్యలకు చంద్రబాబు కి ఆయన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదన్నారు.

ADVERTISEMENT

అలాగే లోకేష్ అర్హతా గురించి మాట్లాడే నైతిక హక్కు నానికి లేదని, లోకేష్ యువగళం పాదయాత్రలో లక్షలాది మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అనేకమంది నాయకులు ఆయన వెంట నిలబడి పార్టీని, ఆయన నాయకత్వాన్ని బలపరిచారన్నారు. ఇలా నిన్నటి దాక ఒక గూటి పక్షులు గా ఉన్న నేతలు ఇప్పుడు గూటి నుంచి ఒక పక్షి ఎగిరిపోయిందని విమర్శలు మొదలుపెడితే, ఇంతకాలం ఏంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న గూటిని ఇప్పుడొచ్చి ఆక్రమిస్తానంటే ఎలా అంటూ వైసీపీ ఆశావాహులు కేశినేని నాని పై మండిపడుతున్నారు.

టీడీపీ పార్టీ తనకు అన్యాయం చేసిందని బాబు పై పరుష పదజాలం వాడి వైస్ జగన్ పై ప్రసంశల జడివాన కురిపించి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చిన కేశినేని నాని పై వైసీపీ నేత పీవీపీ సోషల్ మీడియాలో పరోక్షంగా విమర్శల మోత మోగిస్తున్నారు. విజయవాడ ఎంపీ గా వైసీపీ పార్టీ నుండి పోటీ చేయడానికి గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకున్న పీవీపీ కి కేశినేని నాని ఎంట్రీ గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. గత ఎన్నికలలో టీడీపీ, వైసీపీ పార్టీల తరుపున ప్రత్యర్థులుగా పోటీ పడిన వీరిద్దరూ ఇప్పుడు ఒకే పార్టీలో ఉండి ప్రత్యర్థులుగా తలపడుతున్నారు.

“బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంతే…విడి గుడిసేటి బుద్ది గురించి బెజవాడంతా తెలుసు కదరా అబ్బాయి”…అంటూ పీవీపీ తన సోషల్,మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో ఆ బోరుకొచ్చిన బండి ఎవరిది..? ఏ ట్రావెల్స్ లో పనిచేస్తుంది అంటూ కేశినేని నాని పై పరోక్ష కౌంటర్ వేస్తున్నారు అటు టీడీపీ, ఇటు వైసీపీ లో పీవీపీ మద్దతుదారులు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Jailer 2: Shoot Wrapped, But Rajini Is Back

Jailer 2 is back in the news for an interesting reason. Rajinikanth had recently said…

11 minutes ago

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ…

దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టులో నిన్న నీళ్ళు పారాయి. అలాగే దశాబ్దాలుగా విశాఖ వాసులు ఎదురు చూస్తున్న గోదావరి జలాలు పోలవరం…

17 minutes ago