థియేటర్లో పానీపూరీ, బిర్యానీ సర్వీసులు అవసరమా ?

R Madhavan Theatre Food Experience

థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య అసలే తగ్గిపోతుంది అని యావత్ సినీ పరిశ్రమ బాధపడుతున్న తరుణంలో.. థియేటర్ కి వచ్చే ఆ కొద్ది మంది ప్రేక్షకులకు సరైన థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నామా? అనేది ప్రస్తుతం హాట్ డిస్కషన్ గా మారింది.

ఇటీవల M9 ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.. “అసలే బయట ట్రాఫిక్ ని దాటి, ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పించి ఒక సినిమాకి తీసుకొచ్చి.. ఆ సినిమా చూద్దామని కూర్చునే టైంలో సార్ పానీపూరి అంటూ థియేటర్ స్టాఫ్ ఫుడ్ ఆర్డర్స్ తీసుకొని రావడం అనేది చాలా చిరాకైన విషయం. ఇన్ని చిరాకుల మధ్య సినిమా కూడా చికాకు పెట్టిందంటే.. ప్రేక్షకుడు ఫ్రస్ట్రేట్ అవ్వక ఏం చేస్తాడు?” అంటూ థియేటర్ ఎక్స్ పీరియన్స్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మాధవన్.

ADVERTISEMENT

మాధవన్ అన్న విషయంతో ఏకీభవించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది సోషల్ మీడియాలో. సినిమా చూస్తున్న టైంలో థియేటర్లో బిర్యానీ, పానీపూరీ లాంటి ఫుడ్ ఐటమ్స్ స్మెల్ కాస్త చిరాగ్గానే ఉంటుంది. ఒకవేళ పిల్లలతో థియేటర్ కి వెళ్తే.. వాళ్ళు కూడా సదరు ఐటమ్స్ కావాలని మారాం చేసే అవకాశాలు ఎక్కువ.

అయితే.. ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ లో బీర్స్, ఆల్కహాల్ కూడా థియేటర్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ పద్ధతిని ఇండియాలో కూడా ఫాలో అయితే బాగుండు అని దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా అభిప్రాయపడ్డాడు. దానికి తీవ్రమైన బ్యాక్ లాష్ వచ్చిందనుకోండి.

ప్రస్తుతానికి AAA, AMB స్క్రీన్స్ లోనే బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటి ఐటమ్స్ ఆడియన్స్ కి అందిస్తున్నారు. PVR మాత్రం పానీ పూరీ, చాట్ తో సరిపెడుతుంది. అయితే.. అసలు నిజంగానే థియేటర్లలో బిర్యానీ లాంటి ఫుడ్ ఐటమ్స్ అవసరమా? అనే విషయంలో మరోసారి ఓపెన్ డిస్కషన్ & డెసిషన్ మేకింగ్ అవసరమేమో.

ADVERTISEMENT
Latest Stories