Telugu

దేశం దాటాలంటే ఒకరు…సొంత ఊరు వెళ్లాలంటే మరొకరు..!

సంక్రాతి పండగను సొంత ఊరిలో జరుపుకోవాలని ఆశతో ఎక్కడెక్కడి వారు ఈ సమయంలో తమ సొంతూరికి చేరుకుంటారు. ఎవరికీ వారు కారో, బస్సో, రైలో, ఫ్లయిటో ఇలా వారి వారి సౌకర్యాన్ని బట్టి, వారి స్తోమతకు తగ్గట్టుగా తమ సొంత ఊరు చేరుకుంటారు. కానీ నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మాత్రం సంక్రాంతి సందర్భంగా తన సొంతూరు వెళ్ళడానికి హై కోర్ట్ మెట్లెక్కారు.

గత అనుభవాల దృష్ట్యా తనకు తన సొంత ఊరు వెళ్ళడానికి ఏపీ ప్రభుత్వం నుండి రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయించారు RRR .ఏపీ పోలీసులు ఇప్పటికే తన మీద 11 కేసులు నమోదు చేసారని, గతంలో తనను అరెస్టు చేసి చిత్ర హింసలు కూడా పెట్టారని రఘురామా హైకోర్టుకు విన్నవించుకున్న నేపథ్యంలో రఘు రామ కు రక్షణ కల్పించాలంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

ADVERTISEMENT

ఇలా వైసీపీ ప్రభుత్వంలో సొంతూరుకి వెళ్లాలన్న కోర్ట్ మెట్లక్కాల్సిందేనా అంటూ రఘురామా మద్దతుదారులు వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి విదేశాలలో చదువుతున్న తన సొంత కూతురుని కలుసుకోవడానికి దేశం వదిలి వెళ్లాలంటే కూడా ఆయనకు కోర్ట్ అనుమతి తప్పనిసరే. దానికి కారణం వేరే చెప్పనవసరం లేదనుకుంటా అంటూ జగన్ విదేశీ పర్యటనలను గుర్తుచేస్తున్నారు.

దేశం దాటాలంటే “వీసా పర్మిషన్ కన్నా ముందు కోర్ట్ పర్మిషన్” తీసుకోవాల్సిన నాయకుడు ఒకరు, రాష్ట్రము లో తన సొంతూరులో అడుగుపెట్టాలంటే “బంధువుల కంటే ముందు తన రక్షణ కోసం కోర్ట్ ని ఆశ్రయించే” నేత మరొకరు ఇలా అయితే పోయేది రాష్ట్ర పరువా? ప్రభుత్వ పరువా? వైసీపీ పార్టీ పరువా?అనేది ఒక్కసారి వైకాపా నాయకులు ఆలోచించుకోవాలి. ఇటువంటి కక్ష పూరిత రాజకీయాల వలన సాధించేది ఏమిటో రానున్న రోజులలో అన్నిరాజకీయ పార్టీలకు తెలియ చేయడానికి రెడీ అవుతున్నారు ఏపీ ప్రజలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

డీఎస్సీపై సీబీఐ విచారణ కావాలి.. కానీ ఈ కేసుల్లో వద్దా?

ఏపీ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్రంలో వైసీపీ చేసిన హడావుడి అందరూ…

3 minutes ago

President Murmu: Women to Help Make India Developed by 2047

President Droupadi Murmu inaugurated the National Saras Mela at Punnami Ghat in Vijayawada. She said…

14 minutes ago