
రావణ గుట్టు విభీషణుడికి తెలిసినట్టుగా వైసీపీ గుట్టు ఆ పార్టీనేత అయినా రఘురామకు తెలుసునని, ఆ నేపథ్యంలోనే రావణ అంతానికి బాణం ఎక్కడ ఎక్కుపెట్టాలో తెలిసిన వాడు కాబట్టే అక్కడ రావణ దహనం జరిగింది. అలాగే జగన్ ను ఎక్కడ ఇరికించాలో తెలిసిన రఘురామ కూడా జగన్ ను అక్కడే ఇరికించాడు, జగన్ ఇరుక్కున్నాడు కూడా.
జగన్ తనమీద ఉన్న కేసుల విచారణను ముఖ్యమంత్రి హోదా అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నాడని, ఈ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ RRR సుప్రీం కోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. అయితే పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం సిబిఐకు నోటీసులు జారీచేసింది.ఈ కేసులో విచారణ ఎందుకు జాప్యం జరుగుతుందో వివరణ ఇవ్వాలంటూ సిబిఐ అధికారులకు ఆదేశాలిచ్చారు.
రఘురామ వేసిన బదిలీ పిటిషన్ ను ఎందుకు విచారణ జరపకూడదో తెలపాలన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చిన జగన్, విజయసాయి రెడ్డి, అరబిందో,జగతి పబ్లిషర్స్, జనని ఇన్ ఫ్రాస్టక్చర్..ఇలా మరికొందరికి నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. తదనంతరం ఈ కేసు విచారణను జనవరికి వాయిదా వేస్తూ సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు జారీచేసింది.ఇలా “జగన్ పై వైసీపీ విభీషణుడి వ్యూహం” కొంతవరకు ఫలించినట్టే కనిపిస్తుంది.
అయితే ఇక భస్మాసురుడి విషయానికి వస్తే…,గతంలో లోకేష్ జగన్ ను ఉద్దేశించి చంద్రబాబు అరెస్టుతో జగన్ భస్మాసుడిలా తయారయ్యారని తానూ తీసుకున్న నిర్ణయంతోనే తన పార్టీని తానే బూడిద చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.ఇపుడు జగన్ ఆచరిస్తున్న విధానాలు చూస్తుంటే లోకేష్ మాటలు నిజమేనా అన్న సందేహం రాకమానదు. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై జగన్ కేసుల మీద కేసులు వేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని రాజకీయ వర్గాలలో గట్టిగానే చర్చ జరుగుతుంది.
బాబుకి అనారోగ్య కారణాలతో కొన్ని షరతులతో కూడిన తాత్కాలిక బెయిలు ని హైకోర్ట్ ఇష్యూ చేసింది. అయితే చంద్రబాబుకి హైకోర్టు విధించిన షరతులు కాకుండా మరిన్ని షరతులు విధించాలంటూ సిఐడి అధికారులు కోర్టును ఆశ్రయించారు.బెయిలు మీద విడుదలైన చంద్రబాబుతో పాటు ఇద్దరు డిఎస్పీ లను అతనికి తోడుగా పెట్టాలని సిఐడి అధికారుల అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. గతంలో ఏమైతే నిబంధనలు జారీ చేసామో అవి మాత్రమే బాబుకి వర్తిస్తాయని ఇప్పుడు కొత్తగా ఎటువంటి నిబంధనలు ఉండవని కోర్ట్ తీర్పునిచ్చింది.
అయితే బాబుని మానసికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో జగన్ సిఐడి అధికారులను అడ్డుపెట్టుకుని న్యాయస్థానాలలో చంద్రబాబుపై ఇలా కేసులు పెట్టుకుంటూ పొతే ఇక “వైసీపీ పార్టీ పాలిట జగన్ నిజంగానే భస్మాసురుడిగా” మారడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.అయితే ఈ శుక్రవారం జగన్ కు రెండు కేసులలో తీర్పులు అనుకూలంగా రాకపోవడంతో వైసీపీ శ్రేణులకు నిరాశ తప్పలేదు.”ఇటు విభీషణుడు..అటు భస్మాసురుడు! అంతిమ విజయం మాత్రం చెడుని అంతమొందించేవారిదే అనేది పురాణాలు చెపుతున్న వాస్తవాలు”.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…