
గత ఐదేళ్ల అరాచకానికి న్యాయం కావాలి అంటూ వైసీపీ ప్రభుత్వ బాధితులంతా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెంతకు చేరుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తమ అధికారాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేసిందో ఇప్పుడు బయటకు వస్తున్న బాధితులను చూస్తే ఇట్టే అర్ధమవుతుంది.
ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో సంచలం సృష్టించిన బాలీవుడ్ నటి కాదంబరి జేత్వాని కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును దిగజార్చిందనే చెప్పాలి. అయితే కూటమి ప్రభుత్వంలో తనకు న్యాయం కావాలి అంటూ జేత్వాని ఏపీ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే గతంలో తన పై ఈ తప్పుడు కేసులు నమోదు చేసిన పాపంలో విజయవాడ సిపి కాంతిరాణా, డిసిపి విశాల్ గున్నా, ఐపీఎస్ సీతారాంజనేయులు కూడా భాగస్వాములే అంటూ జేత్వాని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఇప్పుడు ఈ కేసు విచారణలో లోతైన దర్యాప్తు అవసరమని భావించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి కి కేసును బదిలీ చేస్తూ ఉతర్వులు జారీ చేసింది. అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం మీద జరిగిన దాడి ఘటనను, టీడీపీ అధినేత అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి ఇంటి మీద జోగి రమేష్ దాడికి పాల్పడిన కేసును కూడా రాష్ట్ర ప్రభుత్వం సిఐడికి బదిలీ చేసింది.
అలాగే వైసీపీ ప్రభుత్వ బాధితుల లిస్టులో ప్రప్రదంగా పేరు నమోదు చేసుకున్న రఘురామా కృష్ణ రాజు కేసులో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులకు ఆదేశాలిచ్చింది. గత పాలకుల అకృత్యాలకు విజయ్ పాల్ సహకరించారని, తన పై అక్రమంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన విజయపాల్ మీద చర్యలు తీసుకోవాలంటూ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామా పోలీసులను ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో కేసు విచారణకు తీసుకున్న గుంటూరు జిల్లా ఎస్పీ రమణ మూర్తి ఈ కేసును జాప్యం చేస్తూ నిందితుడికి తప్పించుకునే సమయం కల్పిస్తున్నారు అనే ఆరోపణలతో ఈ కేసు నుండి రమణ మూర్తిని తప్పించి ఆ బాధ్యతను ప్రకాశం ఎస్పీ దామోదర్ కు అప్పగించినట్లు ప్రకటించింది. దీనితో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ కేసుల బదిలీలతో అయినా వైసీపీ బాధితులకు న్యాయం జరిగేనా అంటూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…
After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…