
కానీ జనసేనాని ప్రశ్నించడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థలో వికృతకోణాలను, మానవీయ కోణాలను కూడా బయటపెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజాధనంతో వాలంటీర్లకు జీతాలు చెల్లిస్తూ వారిని వైసీపీ కోసం వాడుకొంటోందని అందరికీ తెలుసు. కానీ అంతకుమించి, రహస్య సమాచార సేకరణ, బదలాయింపు, అవినీతి, అకృత్యాల గురించి పవన్ కళ్యాణ్ నోట విని అందరూ షాక్ అవుతున్నారు.
ఓ విదంగా పవన్ కళ్యాణ్ వైసీపీకి ఆయువు పట్టు వంటి వాలంటీర్ వ్యవస్థ పునాదులు కదిలిపోయేలా చేశారని చెప్పొచ్చు. ప్రజలకు వాలంటీర్ వ్యవస్థతో అనుబందం పెరిగితే దాని వలన వైసీపీ ఎన్నికలలో లాభపడుతుంది అని పవన్ కళ్యాణ్ బాగానే గుర్తించి వైసీపీని దెబ్బ తీస్తున్నారు.
వైసీపీ కూడా ఇది గ్రహించింది. వాలంటీర్ల వ్యవస్థపై ఇంకా లోతుగా చర్చ సాగితే మొదటికే మోసం వస్తుందనే భయం, ఆందోళనతో తన మంత్రులు పోసాని, రాంగోపాల్ రాంగోపాల్ వర్మ వంటివారితో పవన్ కళ్యాణ్‌పై ముప్పేట దాడి చేయిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ఈ ప్రశ్నలు, చేస్తున్న ఆరోపణలు ప్రజలను, మేధావులను, ఇతర పార్టీలను కూడా ఆలోచింపజేస్తున్నాయి. ఇంకా ఈ చర్చ మరింత లోతుగా కొనసాగేలా చేస్తున్నాయి. వైసీపీలో విభీషణుడు వంటివారైనా ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా వాలంటీర్ వ్యవస్థపై నిశిత విమర్శలు చేశారు.
“వైసీపీ కుటిల రాజనీతితో ఏర్పాటు చేసిందే ఈ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లందరూ మా పార్టీ కార్యకర్తలే అని మా ఎంపీ విజయసాయి రెడ్డే చెప్పుకొన్నారు. అది వైసీపీ కోసమే పనిచేస్తోందని మీరే చెప్పుకొన్నాక అదే మాట పవన్ కళ్యాణ్ అంటే ఉక్రోషం ఎందుకు?పైగా పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్లు అంబటి రాయుడు చేత కూడా చెప్పించడం అవసరమా?అంటే మీరు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ మీద మీకే నమ్మకం లేదనుకోవాలా? ఈ వాలంటీర్ వ్యవస్థ వలన రాష్ట్రంలో లక్షలాదిమంది యువత జీవితాలు నాశనం అయిపోతున్నా మీ రాజకీయాలే మీకు ముఖ్యమా? యువత భవిష్యత్ మీకు పట్టదా?” అంటూ నిప్పులు చెరిగారు.
Ranbir Kapoor and Yash starrer mythological film Ramayana Part 1 will be hitting the screens…
Mitchell Starc's participation in IPL 2027 remains uncertain as Australia prepare for a demanding international…