
ఐదు నెలలపాటు సాగే ఈ భారత్ జోడో పాదయాత్రలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గుండా వారు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేస్తారు. దారి పొడవునా సభలు, స్థానిక నేతలు, మిత్రపక్షాలతో సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తూ ముందుకు సాగుతారు.
2014,2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలు పాలైనప్పుడు రాహుల్ గాంధీ అస్త్ర సన్యాసం చేశారు. పార్టీలో సీనియర్లు తన నాయకత్వ లక్షణాలను పదేపదే ప్రశ్నిస్తుండటం, పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయడానికి వారు అడుగడుగునా అడ్డుపడుతుండటం, వారి ఒత్తిళ్ళకు తలొగ్గి సోనియా గాంధీ కూడా వారికే వంతపాడుతుండటం వలననే ఆయన పార్టీ పగ్గాలు చేపట్టేందుకు నిరాకరిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.
అయితే రాహుల్ గాంధీకి బలమైన నాయకత్వ లక్షణాలు ఉండి ఉంటే ఇటువంటి అంతర్గత సమస్యలను ఏనాడో పరిష్కరించుకొని, పార్టీని తనదైన శైలిలో ముందుకు నడిపించేవారు. కానీ ఆయన అస్త్ర సన్యాసం చేయడం ద్వారా తన అసమర్దతను తానే దృవీకరించుకొన్నట్లయింది!
అదే… 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ సిఎంగా ఉన్న నరేంద్ర మోడీని బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించినప్పుడు ఆయనకు సొంత పార్టీలోను, దేశప్రజలలోను తీవ్ర వ్యతిరేకత ఉండేది. దానిని ఆయన ధైర్యంగా ఎదుర్కొని పోరాడి ప్రధాని అయిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. రాహుల్ గాంధీలో అటువంటి నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ లోపించినందునే నేడు కాంగ్రెస్ ఈ దుస్థితిలో ఉందని చెప్పక తప్పదు.
కనుక తన వలన నిర్వీర్యమైన కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునరుత్తేజపరచాలనో లేక కాంగ్రెస్‌లోని రాజకీయాల నుంచి దూరంగా పారిపోయేందుకే రాహుల్ గాంధీ ఈ జోడో కార్యక్రమం పెట్టుకొన్నారో తెలీదు. కానీ రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలు లేవని తేలిపోయినప్పుడు ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 3,570 కిమీ కాళ్ళు అరిగేలా పాదయాత్ర చేసినా ఏమీ ప్రయోజనం ఉండకపోవచ్చు.
కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు రాహుల్ గాంధీ తన వంతు ప్రయత్నాలు చేస్తూనే తక్షణం పార్టీలో బలమైన నాయకుడు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు చొరవ తీసుకొంటే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. లేకుంటే ఆయన పాదయాత్ర ముగిసేసరికి కాంగ్రెస్ కోట పూర్తిగా బీటలువారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది.
Prabhas is heading towards another massive box-office clash, with Sandeep Reddy Vanga's Spirit scheduled to…
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్యాలస్లో ప్రెస్మీట్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియలో టీడీపి గూండాయిజం చేసిందని…