
తెలంగాణాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నకాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అధికార బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, ఆ ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ద్రుష్టి పెట్టారు రాహుల్.
మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన రాహుల్ కేసీఆర్ పై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఒక ఎటిఎం మాదిరి వాడుకుందని, ఈ ప్రభుత్వంలో తెలంగాణ సంపద లక్ష కోట్లు దోపిడీ జరిగిందని, బంగారు తెలంగాణ నిర్మిస్తాను అన్న కేసీఆర్ తన కుటుంబానికి బంగారు బాట వేసుకున్నారు కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అప్పులే మిగిల్చారన్నారు.
ఈ రాష్టంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి అధికార బిఆర్ఎస్ కి బీజేపీ, ఎంఐఎం పార్టీలు సహకారం అందిస్తున్నారని ఈ మూడు పార్టీలు కలిసి మళ్ళీ తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు సిద్దమయ్యాయన్నారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు – ప్రజల తెలంగాణకు మధ్య జరిగే ఎన్నికలుగా భావించాలన్నారు.ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
అధికార పార్టీని విమర్శిస్తూనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు ఏంచేస్తారో వివరించారు. కేసీఆర్ దోచుకున్న రాష్ట్ర సంపదంతా పేద మహిళల ఖాతాలో జమ చేస్తామని, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ అందచేస్తామని, రైతుబంధు 15 వేల అందిస్తామని , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఆర్థికసాయం..,ఇలా తమ పార్టీ చేయబోయే ఆరు కార్యక్రమాలను హామీలుగా ఇచ్చారు.నేను మోడీ లెక్కకాదు ఆడినమాట తప్పను అంటూ లాస్ట్ పంచ్ ప్రధాని నరేంద్ర మోడీ పై వదిలారు.
ఇలా కేసీఆర్ ప్రభుత్వం లక్ష కోట్ల అవినీతికి పాల్పడిందని రాహుల్ గాంధీ, రాష్ట్ర నాయకులైనా రేవంత్, భట్టి,ఉత్తమ్ కుమార్ వంటి పలువురు నేతలు ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేలా తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.దశబ్ద కాల ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రయత్నాలను ప్రజలు ఎంతవరకు ఆమోదిస్తారో అనేది ఎన్నికల ఫలితాలతోనే రుజువవుతోంది.
అయితే తెలంగాణలో లక్ష కోట్ల అవినీతి జరిగింది అన్నా..,ఆంధ్రాలో ఉన్న కొందరు నేతలు తమ భుజాలు తడుముకుంటున్నారని, అలాగే ఏపీ ప్రజలు కూడా మన రాష్ట్ర నేతల అవినీతి గురించి తెలంగాణలో కూడా చర్చకొచ్చిందా ఏంటి అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారని సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న నేతను ఉద్దేశించి సెటైర్లు పేలుతున్నాయి.
Kobali from Ranabaali is a fusion of devotion, anger and cinematic elements. The song presents…
Ranbir Kapoor, Yash and Sai Pallavi are starring in the upcoming adaptation of Ramayana, directed…