
Rahul Gandhi Steps Up CEC Protest
ఢిల్లీ జంతర్ మంత్రం కేంద్రంగా ఇండి కూటమి నేతలు నిర్వహిస్తున్న నిరసనలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రాహుల్ గాంధీ చాల దూకుడుగా బీజేపీ పై రాజకీయ పోరాటానికి సిద్ధమైనట్టు కనిపిస్తున్నారు.
నాటి సీజేపీ నీట్ ఉద్యమ ఫలితం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లో ఇండి కూటమి నాయకులలో ఆత్మస్తైర్యాన్ని పెంచాయా అన్నటుగా ఇండి కూటమి నేతకు ఢిల్లీ వేదికగా బీజేపీ పై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ పై వెనక్కి తగ్గేదెలా అన్నట్టుగా ఇండి కూటమి నేతలు రెచ్చిపోతున్నారు.
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఇండి కూటమి ఎంపీల నిరసన ఉద్రిక్తంగా మారుతున్నాయి. బస్సులో జంతర్ మంతర్ కు వెళ్లేందుకు సిద్దమైన ఇండి కూటమి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రికత్త వాతావరణం ఏర్పడుతుంది.
దీనితో నిరసనకారులను కట్టడిచేసేందుకు గాను అధికారులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లతో సహా మరికొందరు ఇండి కూటమి ఎంపీలను అరెస్టు చేసారు. అరెస్టులతో, అధికారంతో, అణిచివేతలతో తమ ఈ రాజీనామా డిమాండ్ పై వెనక్కి తగ్గేదెలా అంటూ రాహుల్ గాంధీ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అయితే నాటి సీజేపీ ఉద్యమం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కు కారణంగా మారింది. అలాగే నేడు దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా రాహుల్ నాయకత్వంలో ఇండి కూటమి, సీజేపీ ఇద్దరు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉద్యమం, సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్ తో బీజేపీ మరో అడుగు వెనక్కి వేసేందుకు సిద్ధంగా ఉందా.?
ఒకవేళ బీజేపీ ప్రత్యర్థి వరాగం చేస్తున్న ఈ ఉద్యమాలతో ఎన్డీయే ప్రభుత్వం మరోఅడుగు వెనక్కి వేస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ నేత రాహుల్ ఖాతాలో డెబిట్ అవుతుందా.? లేదా సీజేపీ ఖాతాలోనా.?
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వానికి రాజకీయంగా రోజురోజుకి గడ్డుపరిస్థితులు ఎదురవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ల భారం ఒక…
జగన్, కేటీఆర్ ఇద్దరు కూడా తమ పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు చేస్తున్న రాజకీయాలు పార్టీకి బలంగా మారాల్సింది పోయి…