
ఎన్నో దశాబ్దాల పాలనా అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు అధికారం కోసం అరువులు చాస్తోంది, మోడీ, షాల తో రాజకీయ యుద్ధం చేస్తుంది. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ గెలుపు, చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు ఏపీ, బీహార్ రాష్ట్రాల విజయాలతో భయటపడి కేంద్రంలో హ్యాట్రిక్ అధికారాన్ని సొంత చేసుకుంది.
ఇటువంటి తరుణంలో రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆశా కిరణం మాదిరి గోచరిస్తున్నాయి. ఈ కారణంతోనే కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల పై రాజకీయ పట్టు కోసం యత్నిస్తున్నారు.
అందుకు రాహుల్ ఓట్ చోరీ వివాదం నుండి ఆపరేషన్ సింధూర్ విషాదం వరకు ప్రతి అంశంలోనూ ఆపరేషన్ మోడీ అన్నట్టుగా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మొన్న బీహార్ లో ఓట్ చోరీ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో కలిసి ప్రయాణం చేసిన రాహుల్,
నిన్న సోదరి ప్రియాంక తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇక నేడు పెహాల్గమ్ ఉగ్రదాడి కి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు గాను మోడీ పై ట్రంప్ బాణాన్నిప్రయోగిస్తూ విమర్శనాస్త్రాలను వదులుతున్నారు రాహుల్.
ఆపరేషన్ సింధూర్ అంటూ భారత్, పాక్ పై ఎక్కుపెట్టిన యుద్దాన్ని మోడీ, ట్రంప్ ఆదేశాలతో ముగింపు పలికారు. ఆ యుద్ధ వాతావరణ సమయంలో ట్రంప్ మోడీ కి కాల్ చేసి పాక్ పై జరుపుతున్న యుద్దాన్ని 24 గంటలలో ఆపేయాలంటూ ఆదేశించగా మోడీ దాన్ని కేవలం 5 గంటలకే అమలుచేసేసారు అంటూ ఆపరేషన్ మోడీ గా రాహుల్ బీహార్ పర్యటన కొనసాగుతుంది.
మరి బీహార్ లో బీజేపీ ని ఆపరేషన్ సింధూర్ గట్టున పడేస్తుందా.? లేక రాహుల్ మొదలుపెట్టిన ఆపరేషన్ మోడీ కాంగ్రెస్ కు అధికారాన్ని తెచ్చిపెడుతుందా.? అన్నది ఎన్నికల సమయం వరకు వేచి చుడాల్సిందే.
Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…
The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…