
3500 కోట్ల అవినీతి అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనంగా మారిన వైసీపీ లిక్కర్ స్కాం కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి కి ఏపీ హై కోర్ట్ పలు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.
సిట్ విచారణతో గత ఏడాది ఏప్రిల్ లో ఈ కేసులో అరెస్టయ్యి జైలుకెళ్లిన కసిరెడ్డి నాటినుంచి జ్యుడిషియల్ రిమాండ్ లో ఖైదీగా ఉన్నారు. అయితే ఈకేసులో అరెస్టయిన నేకమందికి న్యాయస్థానము ఇప్పటికే బెయిలు మంజూరు చేసింది.
కానీ కసిరెడ్డి అభ్యర్థనలను ఎప్పటికప్పుడు వాయిదాపడుతూ ఎట్టకేలకు దాదాపు ఏడాది తరువాత ఆయనకు న్యాయస్థానం నుంచి బెయిలు లభించింది. అయితే ఈ కేసులో అరెస్టయిన ఒక్కొక్కరు ఇలా బైలు మీద బయటకురావడం తో అసలు ఈ కేసు విచారణ పూర్తవవుతుందా.?
అసలు దోషులు చట్టం ముందు నిలబడతారా.? ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు బిగ్ బాసే, తొందరలో కేసు విచారణ బిగ్ బాస్ ను చేరనుంది అంటూ గతంలో పలు రూమర్లు కూడా మీడియాలోకి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ బిగ్ బాస్ తాడేపల్లి కేంద్రంగానే ఆ మద్యం కుంభకోణం నడిపించారంటూ కథనాలు ప్రచారం అయ్యాయి.
కానీ కట్ చేస్తే, కేసు విచారణ బిగ్ బాస్ ను చేరడం సంగతి అటుంచితే ఇలా కేసులో అరెస్టయినా ఒక్కో వ్యక్తి బెయిలు మీద బయటకు రావడంతో లిక్కర్ కేసు కూడా వివేకా హత్య కేసు మాదిరి, జగన్ అక్రమాస్తుల కేసు మాదిరి టీవీ సీరియల్ మాదిరి సాగాల్సిందేనా అంటున్నారు సామాన్య ప్రజానీకం.
అయితే కోర్టు మాత్రం కసిరెడ్డి కి బెయిలు మంజూరు చేస్తూనే కొన్ని షరతులు విధించింది. కేసు విచారణకై పోలీస్ అధికారులకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయకుడదని, పాస్ పోర్ట్ ని కోర్ట్ కి అప్పగించాలని, అనుమతి లేకుండా రాష్ట్రం విడిచిపోరాదంటూ పలు షరతులు విధించింది.
Aadarsha Kutumbam moving out of the October 9 slot has unexpectedly changed the equation for…
A rather interesting casting buzz is doing the rounds around Ravi Teja and Vivek Athreya’s…