రాజ్..లావణ్య కథ: ప్రేమతో మొదలై…?

గత మూడు నాలుగు రోజుల నుంచి మీడియాలో ఎక్కువగా వినపడుతున్న పేర్లు హీరో రాజ్ తరుణ, ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ లావణ్య. వీరిద్దరి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది ఎవరన్నది ఇప్పటికి ఒక స్పష్టత రాలేదు కానీ ఎవరి వాదన వారు బలంగా వినిపిస్తున్నారు.

హీరో రాజ్ తరుణ్ నేను కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నామని, తనకు రాజ్ కు మధ్య పెళ్లి విషయమై ఇప్పుడు మాట మారుస్తున్నాడని, ఇప్పుడు రాజ్ కు తన సినిమాలో హీరో హిన్ గా నటిస్తున్న మాల్వి మల్హోత్రా తో అక్రమ సంబంధం పెట్టుకుని తనకు అన్యాయం చేయడానికి చూస్తున్నాడని తనకు న్యాయం కావాలని లావణ్య తన వాదన వినిపిస్తుంది.

ADVERTISEMENT

అలాగే గతంలో మేమిద్దరం రిలేషన్ లో ఉన్న మాట వాస్తవమే కానీ ఇప్పుడా ఆ పరిస్థితిలేదని, లావణ్య డ్రగ్స్ వాడడం, వేరొకరితో పెళ్లి వరకు వెళ్లి రావడం ఇవన్నీ తనను ఆమెకు దూరం చేశాయని, కేవలం తన డబ్బు కోసమే లావణ్య ఇటువంటి తప్పుడు వార్తలు ప్రకారం చేస్తుందని రాజ్ తన వర్షన్ వినిపిస్తున్నారు.

అయితే ఇప్పుడీ వివాదంలోకి లావణ్య తల్లితండ్రులు కూడా ప్రవేశించారు. తన కూతురుని రాజ్ నమ్మించి మోసం చేసారని, అన్యాయంగా తన కూతురు మీద నిందలు వేసి రాజ్ తప్పించుకోవాలని చూస్తున్నారని, ఇప్పటికి రాజ్ పైన తమకు మంచి అభిప్రాయమే ఉందని, వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి ముందుకొస్తే లావణ్యను ఇచ్చి వివాహం జరిపిస్తామంటూ లావణ్య తండ్రి చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో మరో విషాదం తెరమీదకు వచ్చింది. రాజ్ లేకుంటే తానూ ఇక బతకలేనని, తానూ ఆత్మహత్య చేసుకుంటానంటూ లావణ్య తన లాయర్ కు సందేశం పంపారు. తానూ జీవితంలో సర్వం కోల్పోయానని, నమ్మి మోసపోయానని, ఇక ఈ యద్ధంలో గెలుస్తానో లేదో తెలియడం లేదని తన ఆత్మహత్యకు కారణాన్ని వివరిస్తూ తన అడ్వాన్స్ కళ్యాణ్ దిలీప్ కు మెసేజ్ చేసారు.

తానూ చనిపోవడానికి హీరోహిన్ మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్, అతని తల్లితండ్రులు కారణమని తన సూసైడ్ నోట్ లో పొందుపరిచారు లావణ్య. ఈ సమాచారాన్ని కళ్యాణ్ దిలీప్ పోలీసులకు అందచేయడంతో అప్రమత్తమైన పోలీసులు లావణ్య ఇంటికి చేరుకొని ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ కేసులో పూర్తి న్యాయం చేస్తామంటూ భరోసా కల్పించారు. ప్రేమతో మొదలైన వీరిద్దరి కథ ఎక్కడితో ముగవబొతుందో.?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Deepika-Ranveer Welcome Second Baby: Fans Wanted More?

Deepika Padukone and Ranveer Singh have reportedly welcomed their second child, a baby girl. Their…

21 minutes ago

If Lust Stories 3 Is Bold, Then Why Was Peddi Attacked?

Ram Charan fans are once again bringing Peddi into the discussion around Lust Stories 3.…

22 minutes ago