“ఆ ఒక్కడికి” ఇది ఖచ్చితంగా రిటర్న్ గిఫ్టేనా…?

Rajadhani Files

రాజకీయాలు – సినిమాలు రెండు కూడా సమాజాన్ని ప్రభావితం చేసే రంగాలు. అయితే సినీ రంగాన్ని రాజకీయాలు ఏవిధంగా ప్రభావితం చేస్తుందో చెప్పవచ్చు కానీ, సినిమాలు రాజకీయాలను ఏమాత్రం ప్రభావితం చేస్తాయో అనేది చెప్పలేము.

కానీ ప్రత్యర్థి పార్టీలను కట్టడి చేయడానికి, తమ పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి మాత్రం సినిమాను ఉపయోగించుకుని ఎవరి వ్యూహాలు వారు పన్నుతుంటారు. గత ఎన్నికలలో యాత్ర సినిమాతో తన పార్టీ మైలేజ్ పెంచుకున్న జగన్, లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలతో టీడీపీ పార్టీకి అంతే డామేజ్ తీసుకురాగలిగారు.

ADVERTISEMENT

ఈసారి ఎన్నికలకు కూడా అదే ఫార్ములా ను నమ్ముకున్న జగన్ వ్యూహం, యాత్ర 2 ను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆర్జీవీ, జగన్ వ్యూహానికి లోకేష్ చెక్ పెట్టడం తో అది కోర్టులో విడుదలకు ఎదురుచూస్తున్న ఖైదీల మాదిరి బయటకు రావడానికి కష్టపడుతుంది.

ఇక యాత్ర 2 తోనే తానూ అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవాలని చూస్తున్న జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది “రాజధాని ఫైల్స్” మూవీ. “జగన్ అధికారం కోసం చేసిన ప్రయత్నం యాత్ర 2 అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని రైతులకు చేసిన అన్యాయమే రాజధాని ఫైల్స్” అనేలా సినిమాలు రూపొందాయి.

ఏపీ రాజధాని అమరావతి అంశం ఆధారంగా సినిమా తెరకెక్కినట్లు సమాచారం. అసలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రాజధాని పట్ల చేసిన హామీలు ఏమిటి.? అధికారంలోకి వచ్చాక చేసిన ప్రకటనలు ఏమిటి.? అనేదాని కేంద్రంగా మూవీ చిత్రీకరించినట్లు మూవీ పోస్టర్ చూస్తే అర్ధమవుతుంది.

ఎటువంటి ప్రమోషన్స్, హడావుడి లేకుండా మూవీ మేకర్స్ సినిమా పోస్టర్ ను రిలీజ్ చేయడంతో ఒక్కసారిగా సినిమా పై ప్రజలలో ఆసక్తి, వైకాపా నాయకులలో టెన్షన్ మొదలయ్యింది. ఇప్పటికే తమ రాష్ట్రానికి రాజధాని లేదని, దేశంలో తమ అస్తిత్వం కు సరైన గుర్తింపు లేకుండా పోతుందని, పక్క రాష్ట్రాల వారిముందు రాజధాని లేని రాష్ట్ర ప్రజలుగా మిగిలిపోయాం అనే భాద, ఎమోషన్, నిరుత్సహంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని ఫైల్స్ తో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని చూపించనున్నారు.

“ఒకే ఒక్కడి అహం..వేల మంది రైతుల కన్నీరు..కోట్ల మంది కుటుంబాల భవిష్యత్”..అంటూ రాజధాని ఫైల్స్ పోస్టర్ విడుదలైంది. భాను ప్రకాష్ దర్శకత్వంలో, కంఠమనేని రవి శంకర్ నిర్మాత గా ఈ మూవీ రూపలాపన జరిగింది. ఇక మిగిలిన నటీనటులు, విడుదల తేదీ తెలియాల్సి ఉంది.

అమరావతి కాదు ‘కమ్మ’రావతి అంటూ రాజధానిని కూల్చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు అమరావతి లో జరిగిన విధ్వంసమే మూల కథగా తెరకెక్కుతున్న రాజధాని ఫైల్స్ మూవీ ని ఏపీలో విడుదల చేయనిస్తుందా..? అన్న అనుమానాలు లేకపోలేదు. ఎన్నికలకు ముందే రాజధాని ఫైల్స్ ప్రజల ముందుకు వస్తే, ఆ సినిమాను ప్రజలు నెత్తినపెట్టుకుంటే మాత్రం ఇన్నాళ్ళుగా ముఖ్యమంత్రిగా నెత్తిన పెట్టుకున్న జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంటికి పంపడానికి మేము కూడా “సిద్ధం” అని ఏపీ ప్రజలు సంకేతం ఇచ్చినట్టుగానే భావించాలి.

ADVERTISEMENT
Latest Stories