ఆర్ఆర్ఆర్ రిలీజ్ పై హింట్ ఇచ్చిన రాజమౌళి

Rajamouli hints about RRR movie releaseఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం, ఆర్ఆర్ఆర్ 2021 జనవరి 8 న సంక్రాంతి స్పెషల్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆ మధ్య ప్రకటించారు. అయితే లాక్డౌన్ బ్రేక్ కారణంగా ఈ చిత్రం సమ్మర్ 2021 కు వాయిదా పడుతుందని పుకార్లు ఉన్నాయి.

ADVERTISEMENT

మొదట్లో దానిని ఖండించిన రాజమౌలి ఇప్పుడు వాయిదా ఖాయం అని అంటున్నట్టుగా అనిపిస్తుంది. “మేము ఇప్పుడు దీనిపై కామెంట్ చెయ్యలేం. సంక్రాంతి విడుదల కోసం సినిమాను పూర్తి చేయడానికి మాకు బఫర్ ఉంది. అయితే ఇప్పుడు మొత్తం తారుమారు అయిపోయింది. లాక్డౌన్ ఎప్పుడు సడలించబడుతుందో దానిపై ఆధారపడి ఉంటుంది” అని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు కోసం కొమరం భీమ్ క్యారెక్టర్ వీడియో విడుదల అయ్యే అవకాశం లేదని ఆయన ఇప్పటికే ధృవీకరించారు. ఇద్దరు లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్స్ – అల్లూరి సీతా రామరాజు మరియు కొమరం భీమ్ ఆధారంగా తీస్తున్న కల్పిత కథ ఆర్ఆర్ఆర్. వారి పోరాటాలకు ముందు ఢిల్లీలో కలిసినప్పుడు ఏమి జరుగుతుందో ఈ చిత్రం.

రామ్ చరణ్ అల్లూరి పాత్రలో, ఎన్టీఆర్ తెలంగాణ యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఇద్దరు స్టార్లను పాన్ – ఇండియా రేంజ్ కు తీసుకుని వెళ్తుందని వారి అభిమానులు ఎంతో ఆశపెట్టుకున్నారు. ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.

ADVERTISEMENT
Latest Stories