
రాజమౌళి నోట నుండి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించిన ఒకే ఒక్క పేరు మహేష్ బాబు మాత్రమే. అయితే ఈ సినిమా పట్టాలెక్కడానికి మరికొంత సమయం పడుతుందని కూడా రాజమౌళి చెప్పారు. దీంతో తదుపరి సినిమా జాబితాలో ప్రిన్స్ పేరు లేదన్నది స్పష్టం. అయితే తమతో సినిమాలు చేయాల్సిందిగా రాజమౌళిపై పలు హీరోల నుండి ఒత్తిడి వస్తున్నట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం అఖిల్ – రాజమౌళిల కాంభినేషన్ తో నాగార్జున ఓ సినిమా చేయాలని కోరుతున్నారట.
అలాగే రామ్ చరణ్ ను ‘మగధీర’ ద్వారా స్టార్ హీరోగా నిలబెట్టిన జక్కన్న, మరో మెగా హీరో అల్లు అర్జున్ తో కూడా ఓ సినిమా చేయాలని మెగా కాంపౌండ్ నుండి తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి బహిరంగమే. గత కొన్ని సంవత్సరాలుగా బహిరంగ వేడుకల మీదే చాలా సార్లు జక్కన్నను సినిమా అడిగిన ‘బుడ్డోడు,’ ప్రస్తుతం కూడా అదే విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ట్రేడ్ టాక్. ఇలా స్టార్ హీరోల జాబితా కాకుండా… బరిలో నాచురల్ స్టార్ నాని కూడా ఉన్నారు.
‘బాహుబలి 2’ వంటి సినిమా తర్వాత ఒక సాధారణ సినిమా చేయాలని జక్కన్న భావిస్తున్నారని, ఇందుకు నానిని హీరోగా తీసుకున్నారని సమాచారం అందుతోంది. అయితే ఇప్పటివరకు ఏది అధికారికం కాలేదు. భూటాన్ వెళ్లి వచ్చిన తర్వాత మాత్రమే తన తదుపరి సినిమాపై దృష్టి పెడతానని రాజమౌళి స్పష్టం చేయడంతో, జక్కన్న పర్యటన ముగింపు కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఏ స్టార్ హీరోకు అందనంత ఎత్తులో జక్కన్న ఉండడంతో, ‘రాజమౌళి నెక్స్ట్ ఏంటి?’ అన్నది అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
Sumanth Prabhas and Ananthika Sanilkumar’s Romanchakam has received a major boost on its release day,…
చిత్రం: రోమాంచకం M9 రేటింగ్: 2/5 విడుదల తేదీ: సెప్టెంబర్ 03, 2026 తారాగణం: సుమంత్ ప్రభాస్, అనంతిక సానిల్…