ఆర్ఆర్ఆర్… లీకులతో చంపేసేటట్లున్నారు..!

Rajamouli Ntr ram charan RRR interviewమరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “ఆర్ఆర్ఆర్”పై ప్రేక్షకుల అంచనాలు తారాస్థాయికి చేరుకునేలా సోషల్ మీడియాలో పోస్ట్ లు ప్రత్యక్షం అవుతున్నాయి. ఈ పోస్ట్ లు చూసిన అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ బంపర్ బొనాంజా మల్టీస్టారర్ మూవీ ధియేటర్లలో దర్శనమిస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.

ఈ మూవీకి వర్క్ చేసిన వారు, అలాగే ఈ మూవీని ఇప్పటికే తిలకించిన వారు ఉత్సాహం ఆపుకోలేక సోషల్ మీడియా ద్వారా వారి అనుభూతులను మెల్లగా ‘లీకుల’ రూపంలో ఇస్తున్నారు. మలయాళం వెర్షన్ కు సంబంధించి కలరిస్టు శివ 3000 కోట్లు వసూలు చేసే సినిమాగా అభివర్ణించగా, తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పిన పలు ఆసక్తికర విషయాలు ఫ్యాన్స్ ను 25వ తేదీ ఎప్పుడు వస్తుందా? అని ఆలోచించేలా చేస్తున్నాయి.

ADVERTISEMENT

జక్కన్నకు కొన్ని విషయాలలో కోడ్ లాంగ్వేజ్ లు వాడతారని, ఉప్మా అంటే సినిమా, జీడిపప్పు అంటే స్క్రీన్ ప్లే హైలైట్స్ అని, సినిమా అయ్యాక కీరవాణి గారు ఎన్ని జీడిపప్పులు ఉన్నాయో లెక్కలు వేసారని, ఇందులో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, నాటు నాటు, ఇంటర్వెల్ తర్వాత సీన్ ను అయితే పెద్దన్న అది జీడిపప్పు కాదురా ఆటం బాంబ్ అని చెప్పినట్లుగా జక్కన్న చెప్పుకొచ్చారు.

వర్ణన ఏదైనా రాజమౌళి జీడిపప్పుల కోసం యంగ్ టైగర్ అండ్ మెగా పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ఇంటర్వ్యూలలో వస్తోన్న ఈ లీకు సమాచారంతో పాటు నెట్టింట మరిన్ని అంశాలు హైలైట్ అవుతున్నాయి. ఇంటర్వెల్ కు ముందు వచ్చే బ్రిడ్జి సీన్ అదిరిపోతుందన్న టాక్ కూడా సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హల్చల్ చేస్తోంది.

సాధారణంగా సినిమాలోని హైలైట్ సన్నివేశాలను రాజమౌళి ముందుగా చెప్పరు. అవి సిల్వర్ స్క్రీన్ పైన చూస్తేనే వాటి అనుభూతులను ప్రేక్షకులు సరిగా ఆస్వాదించగలరన్న ఉద్దేశంతో, అంచనాలు పెరిగే విధంగా ఎలాంటి స్టేట్మెంట్ లు ఇవ్వరు. కానీ “ఆర్ఆర్ఆర్”కు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రమోషన్స్ చేస్తుండడం అనేది… ఎన్ని అంచనాలు పెట్టుకొచ్చినా వాటిని మించే విధంగా సన్నివేశాలు రూపుదిద్దుకున్నాయన్న నమ్మకమా?

నిజంగా అలా ఉంటే బాక్సాఫీస్ వద్ద “ఆర్ఆర్ఆర్” సృష్టించే ప్రభంజనం ఏ స్థాయిలో ఉండబోతోంది? కలెక్షన్స్ విషయంలో ‘బాహుబలి’ పార్ట్ 2ని మించిపోయే విధంగా ఉంటుందా? ఇలాంటి అనేకానేక ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతున్న తరుణంలో… ప్రస్తుతం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లతో జరుగుతున్న ప్రమోషన్స్ మాత్రం ఇద్దరు హీరోల అభిమానులకు కన్నులపండుగగా ఉంటున్నాయి.

ADVERTISEMENT
Latest Stories